Jobs: ఆంధ్ర అటవీశాఖలో ఉద్యోగాలు..నోటిఫికేషన్ రిలీజ్ ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్ పడింది. ఈసారి అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి పిలుపునిచ్చింది గవర్నమెంట్. 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నోటిషికేషన్ విడుదల చేశారు. వివరాల కోసం కింద ఆర్టికల్ చదవేయండి. By Manogna alamuru 10 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Forest Officer Jobs : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 37పోస్టుల కోసం ప్రకటన విడుదల అయింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.దరఖాస్తుదారులకు మూడు పరీక్షలు ఉంటాయి. మొదట రాత పరీక్ష ఉంటుంది. అందులో పాసయితే..తరువాత కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో కూడా సెలెక్ట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అర్హత: మొత్తం 37 ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్(Forest Officers Job Notification) పడింది. వీటికి అప్లే చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానితో సమానమైన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును. అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రికల్చర్/ కెమికల్ / సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో విద్యార్హతతో పాటు నోటిఫికేషన్‌లో చూపిన విధంగా శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయస్సు.. 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో అభ్యర్ధుల వయసు ఉండాలి. ఫీజు.. ముందు దరఖాస్తుకు రూ. 250 ఫీజు కట్టాలి. దాని తరువాత పరీక్ష ఫీజు రూ. 120 కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్‌మెన్ వాళ్ళకు అయితే పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది. జీతం.. ఫారెస్ట్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయితే రూ. 48,000 నుంచి రూ. 1,37,220గా జీతం ఉంటుంది. కేడర్‌ను బట్టి జీతాన్ని నిర్ణయిస్తారు. పరీక్షా కేంద్రాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు. Also Read : Siddham: నేడే ‘సిద్ధం’ చివరి సభ.. 15లక్షల మంది వస్తారని అంచనా.. జగన్ ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ! #andhra-pradesh #jobs #forest-officers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి