Big Breaking : ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే అరెస్ట్

ఓటు వేసే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్‌ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

EVM Violence : ఓటు (Vote) వేసే సందర్భంలో బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎం (EVM) ను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్‌ (Polling) కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటన ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో జరిగింది. చిలికా బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ ఈసారి ఖుర్దా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. బెగునియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కౌన్రిపట్నలో ఆయన ఓటు ఉంది. కాగా, శనివారం ఆరో దశ పోలింగ్‌ సందర్భంగా ప్రశాంత్ జగ్‌దేవ్ తన భార్యతో కలిసి పోలింగ్‌ బూత్‌కు వచ్చారు. ఆ సమయంలో ఈవీఎం మోరాయించడంతో ఓటు వేసేందుకు కాసేపు వేచి ఉన్నారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి, ఎమ్మెల్యే అభ్యర్థి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపగించిన ప్రశాంత్‌, టేబుల్‌పై ఉన్న ఈవీఎంను లాగడంతో అది కిందపడి పగిలింది. దీంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు ఈవీఎంను ధ్వంసం చేసిన బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ జగ్‌దేవ్‌ (Prashant Jagadev) పై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఖుర్దా జైలుకు ఆయనను తరలించారు.

Also read: నేడే నటి హేమ విచారణ.. అరెస్ట్ చేస్తారా?

#bjp #evm #odisha #mla-candidate #prashant-jagadev
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe