Red Bull Players : మానవత్వాన్ని(Humanity) చూపించడానికి ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. చిన్న చిన్న పనుల్లో కూడా మానవత్వం చూపుతూ మనిషిగా నిరూపించుకోవచ్చు. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఫుట్‌బాల్ మ్యాచ్(Football Match) కు ముందు ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆటగాళ్ళు, మస్కట్‌లు(పిల్లలు) మైదానంలో ఉన్నారు. అకస్మాత్తుగా భారీ వర్షం(Heavy Rain) పడుతుంది. అప్పటికే మస్కట్ లు జాతీయ గీతాలాపన చేస్తున్నారు.వారి వెనకానే ఆటగాళ్లు నిల్చున్నారు. వర్షంలో తడుస్తున్న చిన్నారులను చూసి ఆ ఆటగాళ్లు ఏం చేశారో తెలుస్తే కచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతారు.
ఇన్ స్టాగ్రామ్ లోని గుడ్ న్యూస్ మూవ్ మెంట్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోకు భారీగా లైకులు వస్తున్నాయి. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే... ఇటీవల, ఫుట్‌బాల్ గేమ్ (న్యూయార్క్ రెడ్ బుల్ సాకర్ వీడియో) జరిగింది.మ్యాచ్‌కు ముందు, ఆటగాళ్లు తమ మస్కట్‌లతో మైదానంలోకి వెళ్లారు.అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. వర్షంలోనే చిన్నారులు జాతీయ గీతాలాపన(National Anthem) ప్రారంభించారు. చలికి వణుకుతూ జాతీయ గీతం పాడుతున్న చిన్నారులను చూసి ఆటగాళ్లు చలించిపోయారు. వెంటనే ఓ ఆటగాడు తన జాకెట్ ను తీసి ఓ పిల్లాడికి కప్పాడు. అది చూసిన మిగతా ఆటగాళ్లు కూడా పిల్లలకు జాకెట్లు కప్పారు. దీంతో చిన్నారులు సంతోషంగా ఫీల్ అయ్యారు. న్యూయార్క్ రెడ్ బుల్ జట్టు సభ్యులు చేసిన పనికి నెటిజన్లు సైతం హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ వీడియోను ఇప్పటివరకు 58 లక్షల మంది వీక్షించారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వెల్లడిస్తున్నారు. ఒక్క వ్యక్తి ద్వారానే పెద్ద మార్పు వస్తుందనడానికి ఇది నిదర్శనం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది చూడగానే మనసుకు సంతోషం కలిగిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... అలాంటి అడుగు పెద్ద మార్పును తెస్తుందని మరోనెటిజన్ కామెంట్ చేశాడు.
ఇది కూడా చదవండి : నారా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించిన కేంద్రం.