Vijetha Super Market: హైదరాబాద్‌లోని విజేత సూపర్ మార్కెట్ నాసీరకానికి మారుపేరుగా మారింది. నగరంలోని మదీనాగూడ, చందానగర్ ప్రాంతాల్లో ఉన్న విజేత సూపర్ మార్కెట్‌లో ఓకే సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అధికారుల సోదాల్లో నిర్వహకులు స్టోర్‌లో నాసీరకం పదార్ధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చందానగర్‌లోని స్టోర్‌లో బూజు పట్టిన పరోటాలను స్వాధీనం చేసుకున్న అధికారులు..మదీనాగూడలో బూజు పట్టిన జున్నును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పదార్దాలు వినియోగ దారులు తీంటే అనారోగ్యానికి గురై మరణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
విజేత సూపర్ మార్కెట్‌పై కేసు నమోదు చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ హృదయ తెలిపారు. నాసీరకం వస్తువులు అమ్ముతూ వ్యాపార సామ్రాజ్యం స్థాపించిన విజేత సూపర్ మార్కెట్ ప్రజల ప్రణాలను మార్కెట్‌లో అమ్ముతున్నారన్నారు. మరోవైపు చందానగర్‌లో నాసీరకంగా మారిన జున్నును విక్రయిస్తున్నట్లు తెలిపిన ఆమె.. చిన్న పిల్లలు తినే జున్నును కూడా ఇలా తయారు చేసి అమ్మడం దారుణమన్నారు. తల్లిదండ్రులు ఇలాంటి జున్నును పిల్లలకు పెడితే పిల్లలు మరణించే అవకాశం ఎక్కువగా ఉన్నాయని సూచించారు. కాగా విజేత మార్కెట్‌పై తమకు పలు మార్లు ఫిర్యాదులు అందాయని దీంతో తాము రెండు స్టోర్‌ల్లో రైడ్ చేసినట్లు తెలిపారు.
నాసీరకమైన వస్తువులను విక్రయిస్తున్న ఇలాంటి మార్కెట్‌ల వెనుక ఎలాంటి బడా బాబులు ఉన్నా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నాసీరకమైన వస్తువులు అమ్మడం వల్ల వినియోగ దారులు అనారోగ్యానికి గురైతే.. ఆ వస్థువులను అమ్మిన సంస్థ భరిస్తుందా అని ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం విజేత మార్కెట్ విక్రయిస్తున్న నాసీరకమైన వస్తువుల సాంపిల్స్ సేకరించామని, వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. రిపోర్ట్ రాగానే సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ హృదయ స్పష్టం చేశారు.
Also Read: