Dog Meat: ఆ ప్రాంతంలో కుక్క మాంసం రవాణా !

కర్ణాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని కొన్ని హిందూత్వ సంఘాలు ఆరోపించాయి. దీంతో ఫుడ్‌ సెఫ్టీ అధికారులు మాంసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

Dog Meat: ఆ ప్రాంతంలో కుక్క మాంసం రవాణా !
New Update

కర్ణాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా రాజస్థాన్‌ నుంచి రైలులో వచ్చిన మాంసం శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో వాగ్వాదం చెలరేగింది. ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని కొన్ని హిందూత్వ సంఘాలు విమర్శలు చేశాయి.

Also Read: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ ఆ విషయాలే చెప్పారు: బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం

అయితే రాజస్థాన్‌ రాజధాని జైపూర్ నుంచి జైపూర్‌- మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో కుక్క మాంసం డబ్బాలు రవాణా అవుతున్నాయని పలువురు ఆరోపణలు చేశారు. ఏకంగా 90 మాంసం పార్సిల్స్‌ను వాహనంలోకి లోడ్ చేయకుండా అడ్డుకున్నారు. అయితే రైలులో పార్సిల్ ద్వారా రవాణా అయిన మాంసం మటన్‌ అని ఆ వ్యాపారి చెప్పాడు. గత 12 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మాంసం నమునాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. మటన్‌ కాకుండా వేరే జంతువుల మాంసమని తేలితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: రీల్స్‌ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు

#telugu-news #telangana-news #dog-meat #karnataka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe