మానవునికి కీలకమైన అవయవాల్లో చెవులు కూడా ఒకటి. ఎదుటివారు చెప్పేది సరిగా వినపడకపోతే.. చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే చెవులను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ వీటికి ఏదైన సమస్య వచ్చిన కొన్ని జాగ్రత్తలతో కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి చెవిలో ఏర్పడిన గలిమి మోతాదు కంటే ఎక్కువగా ఏర్పడితే చెవి సమస్య మొదలవుతుంది. మరోవిషయం ఏంటంటే.. మన చెవులను దుమ్ము, చెత్త నుంచి రక్షించేది గులిమినే. తలలోపల ఏదైన సమస్య వచ్చినప్పుడు కూడా చెవిలో గులిమి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే చెవి సున్నితమైన భాగాలు పాడు చేయకుండా.. వాటిని శుభ్రం చేయడం ఎంతో అవసరం.
Also Read: కాళ్ల పిక్కలు పట్టేసినట్లు అనిపిస్తుందా..అయితే వెంటనే ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి!
చెవులను శుభ్రం చేసేందుకు ఇయర్ బడ్స్‌నే చాలామంది వినియోగిస్తుంటారు. కాని అది ఉత్తమమైన ఎంపిక కాకపోవచ్చని వైద్యలు సలహ. స్నానం చేసిన తర్వాత వెంటనే చెవి లోపల దూదితో శభ్రం చేస్తే.. మురికి తొలగిపోతుంది. ఒకవేళ చెవిలోపల ఇంకా మురికి ఉన్నట్లైతే దూది గాని, ఇయర్ బడ్స్‌ను వాడొద్దని వైద్యులు సూచినస్తున్నారు. ఆ మురికిని తొలగించేందుకు వెచ్చని నీటిలో ఉప్పు వేసి అది కరిగిన తర్వాత.. ఒక చెవిని పైకి వంచి అందులో తగినంత మోతాదులో ఉప్పునీరు వేయాలి. కొద్దిసేపయ్యాక చెవినికి కిందికి వచ్చి నీరుని బయటికి పంపించాలి. ఆ తర్వాత దూదితో చెవిని శుభ్రం చేసుకోవాలి.
అయితే చెవిలో గులిమి తొలగించేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది మొండి మురికిని కూడా తరిమేస్తుంది. పడుకుని మీ చెవిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ సమాన మొత్తంలో నీటిని మిశ్రమం చేసి వేయండి. ఒకటి రెండు నిమిషాల తర్వాత కూర్చుని ద్రావణాన్ని మీ చెవి దగ్గర ఉంచిన కాగితపు టవల్ లేదా గుడ్డలో వేయండి. ఇలా చేస్తే చెవులు శుభ్రంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: బీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను తింటే.. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లాగా పనిచేస్తాయి..!!