Watch Video: అమెరికాలో వరదలు.. నీట మునిగిన రోడ్లు, ఇళ్ళు

అమెరికాలోని గత వారం రోజులుగా ఐయెవా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. దాదాపు 4,200 ఇళ్ళు నీటమునిగాయి. అక్కడి గవర్నర్‌ కిమ్‌ రేనాల్డ్స్‌ 21 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. ఇక సౌత్ డకోటా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.

New Update
Watch Video: అమెరికాలో వరదలు.. నీట మునిగిన రోడ్లు, ఇళ్ళు

అమెరికాలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా ఐయెవా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. దాదాపు 4,200 ఇళ్ళు నీటమునిగాయి. వరదలతో ఎక్కడా కూడా రోడ్లు కనిపించడం లేదు. నదుల్లో నీటి ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రంగంలోకి దిగిన అక్కడి ప్రభుత్వం.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్లు, బోట్లలో తరలిస్తున్నారు.

Also Read: 12వ సారి తండ్రి అయిన ఎలాన్ మస్క్-ష్..గప్‌చుప్

అక్కడి గవర్నర్‌ కిమ్‌ రేనాల్డ్స్‌ 21 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. ఇక సౌత్ డకోటా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో మరిన్న వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిచ్చింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు అమెరికాలోని పలు ప్రాంతాల్లో హీట్‌వేవ్‌ కొనసాగుతోంది. 1936 తర్వాత ఆ స్థాయిలో వేడిని ప్రజలు అనుభవిస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీలో 37.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా.. న్యూజెర్సీ, కొలంబస్‌, ఒహైయో, డెట్రాయిట్‌ తదితర ప్రాంతాల్లో 32 డిగ్రీలు దాటింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు