Telangana: మున్నేరుకు వరద ముప్పు..ఖమ్మంకు డిప్యూటీ సీఎం

తెలంగాణలో ఇంకా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి మున్నేరు వాగులో చేరుతోంది. దీంతో ఇది పొంగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ స్పీకర్ భట్టి కూడా ఖమ్మానికి బయలుదేరారు.

పర్యాటక, సాంస్కృతిక అధికారులతో భట్టి మీటింగ్-LIVE
New Update

Munneru Floods: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు మున్నేరు వాగును ముంచేస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి వాగులో చేరుతోంది. దీంతో మున్నేరు పొంగే అవకాశం కనిపిస్తోంది. ఈ వాగు కనుక పొంగితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతాయి. నష్టం ఎక్కువగా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో పాటూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం బయలుదేరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగానే హెచ్చరించాలని సూచించారు భట్టి. వరద ఉద్ధృతి మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలకు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉద్ధృతి పెరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వరదల రాకుండా ఉండేందుకు, వచ్చినా ఎక్కువ నష్టం జరగకుండా చూసుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని.. సహాయక శిబిరాలను మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించామని తుమ్మల తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు వెళ్లాలని కోరారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

#khammam #munneru #telangana #floods #deputy-cm #bhatti
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి