Floods: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు అస్సాంలో అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో లక్షల సంఖ్యలో ప్రజలు వరదలకు తీవ్ర ప్రభావితులయ్యారు. ఈ ఏడాది వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 106కి పెరిగింది. అస్సాం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం సుమారు 24 జిల్లాల్లోని 12.33 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రస్తుతం వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ 75 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 2,406 గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి.
అస్సాంలో 32,924.32 హెక్టార్లలో సాగు భూములు ముంపునకు గురయ్యాయి. ఈ వరదలకు ధుబ్రి జిల్లాలోని కాచర్, గోలాఘాట్, నాగాన్, గోల్‌పరా, మజులి, సౌత్ సల్యాజీ, ధేమాజీ ప్రజలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద ప్రభావిత జిల్లాల్లోని 316 సహాయ శిబిరాల్లో 2.95 లక్షల మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.
Also Read:National: బీజేపీ భయం పోయింది..ఉప ఎన్నికల్లో విజయభేరిపై రాహుల్ కామెంట్