Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

New Update
Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత

Floods: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు అస్సాంలో అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో లక్షల సంఖ్యలో ప్రజలు వరదలకు తీవ్ర ప్రభావితులయ్యారు. ఈ ఏడాది వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 106కి పెరిగింది. అస్సాం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రకారం సుమారు 24 జిల్లాల్లోని 12.33 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రస్తుతం వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ 75 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 2,406 గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి.

అస్సాంలో 32,924.32 హెక్టార్లలో సాగు భూములు ముంపునకు గురయ్యాయి. ఈ వరదలకు ధుబ్రి జిల్లాలోని కాచర్‌, గోలాఘాట్‌, నాగాన్‌, గోల్‌పరా, మజులి, సౌత్ సల్యాజీ, ధేమాజీ ప్రజలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద ప్రభావిత జిల్లాల్లోని 316 సహాయ శిబిరాల్లో 2.95 లక్షల మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.

Also Read:National: బీజేపీ భయం పోయింది..ఉప ఎన్నికల్లో విజయభేరిపై రాహుల్ కామెంట్

Advertisment
తాజా కథనాలు