Tanker Fall In Vally : మహారాష్ట్ర (Maharashtra) లో ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి - నాసిక్ రహదారి (Mumbai - Nasik) పై వెళ్తున్న ఓ పాల ట్యాంకర్ (Milk Tanker) అదుపుతప్పి 300 అడుగుల దిగువకు ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఎదురైంది. చివరికి ఘటనాస్థలం నుంచి మృతదేహాలను వాళ్లు బయటకు తీశారు.
Also Read: ఈరోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే ?
ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో కూడా ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బులంద్‌షహర్ జిల్లాలో ఓ వ్యానును బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: ఆ గ్రామంలో రెండు రోజులు రాఖీ పండుగ.. ఎందుకో తెలుసా ?