World Photography Day : ఈరోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే ? ప్రతిఏడాది ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుగుతుంది 2010, ఆగస్టు 19న మొదటిసారిగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరిగింది. ఆ రోజున గ్లోబల్ ఆన్‌లైన్ గ్యాల్లెరీలో దాదాపు 270 ఫొటోగ్రఫర్లు తాము తీసిన ఫొటోలను షేర్ చేసుకున్నారు. By B Aravind 19 Aug 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Photography : ఏదైన ఓ ప్రదేశాన్ని ఫొటో తీసి అందులో ఉన్న అద్భుతాన్ని చూపించవచ్చు. ఒక్క ఫొటోతో ఓ దేశ పరిస్థితి ఎలా ఉందో చెప్పొచ్చు. ప్రభుత్వ పాలన ఎందో చూపించొచ్చు. మనం చూసిన దృశ్యాన్ని మరోసారి చూపించి, మనం చూడని దాన్ని కూడా కళ్లకు కట్టినట్లు చూపించేదే ఫొటో. అసలు ఫొటో అనేదే లేకపోయి ఉంటే మన ముందు తరాల జీవనవిధానం, వారి చరిత్రని చూసేవాళ్లం కాదు. అందుకే ఫొటో అనేది మనుషుల జీవితాల్లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈరోజు(ఆగస్టు 19) ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (World Photography Day). చాలామంది సంతోషంగా ఉండే క్షణాలను, ముఖ్యమైన సందర్భాలను ఫొటోలు తీసుకుంటారు. వాటిని భద్రపరుచుకుంటారు. మళ్లీ ఎప్పుడైన దాన్ని చూసినప్పుడు అప్పటి క్షణాలను నెమరువేసుకుంటారు. అందుకే ఒక ఫొటోకి అంత ప్రాధాన్యం ఉంటుంది. Also Read: రాఖీకి సాధారణ సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి.. ఫ్రాన్స్ (France) లో లూయిస్ డాగురే అనే కళాకారుడు ఫొటోను సృష్టించే డాగ్యురోటైప్ విధానాన్ని కనిపెట్టడంతో 1839, ఆగస్టు 19న ఫ్రెంచ్ ప్రభుత్వం దీన్ని గుర్తించింది. చిత్రాలను బంధించడం, వాటిని భద్రపరిచే రోజుగా పరిగణించింది ఇదే ఫొటోగ్రఫీ పుట్టుకకు కారణమయ్యింది. 2009లో ప్రపంచ ఫొటోగ్రఫీ ఆర్గనేషన్.. ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరిపాలని ప్రతిపాదించింది. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుతున్నారు. ఫొటోగ్రఫర్లు, ఆశావాహులు, సాధారణ ప్రజలు.. కళ, సంస్కృతి, సమాజాన్ని ఫొటోగ్రఫీ ఎలా ప్రభావితం చేస్తుందనేదాన్ని గుర్తించడం, దాన్ని ఓ వేడుక లాగ చేసుకునే అవకాశాన్ని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం కల్పిస్తుంది. 2010, ఆగస్టు 19న మొదటిసారిగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరిగింది. ఆ రోజున గ్లోబల్ ఆన్‌లైన్ గ్యాల్లెరీలో దాదాపు 270 ఫొటోగ్రఫర్లు తాము తీసిన ఫొటోలను పంచుకున్నారు. Also Read: ఆ గ్రామంలో రెండు రోజులు రాఖీ పండుగ.. ఎందుకో తెలుసా ? ఇదిలా ఉండగా ప్రస్తుత రోజుల్లో ఫొటోలకు ఉండే క్రేజే వేరు. కెమెరాతో ఉండే మొబైల్ ఫోన్స్, స్మార్ట్‌ఫోన్లు వచ్చాక మనకు కావలసినప్పుడల్ల ఫొటోలు, సెల్పీలు తీసుకునే అవకాశం వచ్చింది. ప్రతిఒక్కరి ఫోన్‌లో కూడా వారికి సంబంధించిన ఫొటోలు ఉంటాయి. ఒక్కసారి ఎక్కడైనా ఫొటో దిగామంటే దాన్ని మళ్లీ ఎప్పుడైన చూసుకోవచ్చు. ఎల్లకాలం భద్రపరుచుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఫొటోగ్రఫీని కూడా జీవనోపాధిగా ఎంచుకుంటున్నారు. సొంతంగా స్టూడియోలు పెట్టుకొని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. #telugu-news #world-photography-day #photography మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి