Uttarakhand : దారుణం.. ఆర్టీసీ బస్సులో బాలికపై గ్యాంగ్‌ రేప్

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మరో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో టీనేజ్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌ చేశారు. ఘటన తర్వాత ఒంటరిగా ఉన్న బాలికను చూసిన స్థానికులు శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.

New Update
Uttarakhand : దారుణం.. ఆర్టీసీ బస్సులో బాలికపై గ్యాంగ్‌ రేప్

Gang Rape : ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లోని డెహ్రాడూన్‌ (Dehradun) లో దారుణం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు (RTC Bus) లో టీనేజ్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌ చేయడం కలకలం రేపింది. ఓ బస్టాండ్‌లో బస్సు ఆగాకా ప్రయాణికులందరూ దిగిపోయారు. ఆ తర్వాత మొదటగా డ్రైవర్, కండక్టర్‌ ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత పక్కనే ఆగి ఉన్న మరో ఇద్దరు బస్‌ డ్రైవర్లు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Also Read: రాఖీ పండుగ వేళ.. కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్‌ ఎమోషనల్ పోస్ట్

చివరగా బస్టాండ్‌లో ఆ బాలికను క్యాషియర్ కూడా రేప్ చేశాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న బాలికను చూసిన స్థానికులు శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. ఆగస్టు 12న ఈ ఘటన జరిగింది. ఇదిలాఉండగా ఇప్పటికే కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ (Kolkata Trainee Doctor) హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఇలా వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: ప్రతీ గంటకు నాలుగు రేప్‌లు.. మహిళలకు భద్రతెక్కడ ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు