Encounter: దద్దరిల్లిన దండకారణ్యం.. మావోల కాల్పుల్లో సైనికులు మృతి

భారత భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లింది. మంగళవారం సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని టేకులగూడెం గ్రామం వద్ద భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టగా ఎదురుపడిన మావోలు బలగాలపై కాల్పులు జరిపారు. 14 మంది గాయపడగా ముగ్గురు సైనికులు చనిపోయారు.

Encounter: దద్దరిల్లిన దండకారణ్యం.. మావోల కాల్పుల్లో సైనికులు మృతి
New Update

Sukma-Bijapur: భారత భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లింది. భీకరమైన కాల్పులతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఉలిక్కిపడింది. మంగళవారం సుక్మా-బీజాపూర్  (Sukma-Bijapur) సరిహద్దులోని టేకులగూడెం గ్రామం వద్ద భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు మొదలు పెట్టగా.. మావోలు (Maoist) సైతం ఎదురుకాల్పులకు పాల్పడ్డారు.

14 మంది జవాన్లకు గాయాలు..

ఈ మేరకు నక్సల్ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు, ఈ ప్రాంత ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలతో ప్రయోజనం చేకూర్చేందుకు సుక్మా/బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన టేకల్‌గూడెం గ్రామంలో ఈరోజు జనవరి 30న నవీవ్ సెక్యూరిటీ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సలైట్లు ఎదురుపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరగగా 14 మంది జవాన్లకు గాయాలయ్యాయి. ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అలాగే మవోయిస్టులు విపరీతంగా కాల్పులు జరుగుతుండటంతో వారిని తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా మావోయిస్టుల కాల్పులకు తెగబడటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇది కూడా చదవండి : Breaking :హెటిరోకు రేవంత్ సర్కార్ షాక్.. ఆ జీవో రద్దు

జోనగూడ-అలిగూడ..

ఇక శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత జోనగూడ-అలిగూడ ప్రాంతంలో పెట్రోలింగ్, సోదాలు చేస్తున్న కోబ్రా/ఎస్టీఎఫ్/డీఆర్‌జీ ఫోర్స్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పులకు భద్రతా బలగాలు కూడా ధీటుగా బదులిచ్చాయి. భద్రతా బలగాల ఒత్తిడిని గమనించిన మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 03 మంది సైనికులు వీరమరణం పొందగా, 14 మంది సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికుల పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

#sukma-bijapur #indian-army #encounter #maoist
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe