Hyderabad: నడిరోడ్డు మీద కాలి బూడిద అయిన బీఎండబ్ల్యూ

రోడ్డు మీద వెళుతున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి...పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో చాలాసేపు రోడ్డు మీద ట్రాఫిక్ నిలిచింపోయింది.

New Update
Hyderabad: నడిరోడ్డు మీద కాలి బూడిద అయిన బీఎండబ్ల్యూ

పేరుకే ఖరీదైన కార్లు. కానీ సాధారణ కార్ల కన్నా కనిష్టంగా ఉంటున్నాయి. ఊహించని విధంగా మంటలు రావడం, కాలిపోవడం లాంటి సంఘటనలతో బెంబేలెత్తిస్తున్నాయి. లక్షలు, కోట్లు పోసి కొనుక్కున్న కార్లు కళ్ళముందే నాశనం అవుతుంటే ఏం చేయలేక వాపోతున్నారు ఓనర్లు. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నడిరోడ్డు మీద ఓ బిఎండబ్ల్యూ కారు దగ్ధమైపోయింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి...నిమిషాల్లో మొత్తం కాలి బూడిద అయిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు.

జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా ఇది బిజీ రోడ్డు కావడంతో ...ప్రమాదం జరిగిన తరువాత కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్‌, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్‌ వరకు గంటలపాటూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే కారు పూర్తిగా కాలిపోయింది. అయితే మంటలు చెలరేగి ఇతర కార్లకు, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే ఆర్పేశారు. ఈలోగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌సు కంట్రోల్ చేశారు.

Also Read:Telangana: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు