Fire Breaks In Train : బీహార్(Bihar) లోని భోజ్‌పూర్ జిల్లాలో రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. న్యూఢిల్లీ - హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని కరిసాత్ స్టేషన్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి ఓ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రైలు నుంచి బయటకు దూకేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. భోజ్‌పూర్ జిల్లా పరిధిలోని కరిసాత్ స్టేషన్ సమీపంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు దానాపూర్ నుంచి ముంబయిలోని లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ వైపుగా వెళ్తోంది.
Also Read: ఒకే కుటుంబం..12,00మంది ఓటర్లు..ఆ ఇంటికి క్యూ కట్టిన అభ్యర్థులు.!
హోలీ పండుగ(Holi Festival) నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం వేసిన ఈ ట్రైన్‌లోని ఏసీ బోగీ(AC Coach) లో మంగళవారం అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటు వ్యాపించడంతో రైలులో కలకలం చెలరేగింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇక చేసేదేమి లేక రైలు నుంచి బయటకు దూకేశారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే లైన్‌లోని ఓ హెచ్‌ఈలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీనివల్ల కొన్ని రైళ్ల మర్గాన్ని మళ్లించాల్సి వచ్చింది. బుధవారం ఉదయం.. ట్రాక్‌ను క్లియర్ చేశారు. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, పాట్నా ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ లాంటి పలు రైళ్లను షెడ్యూల్ మార్గం గుండా రాకపోకలకు పర్మిషన్ ఇచ్చారు. అగ్నిప్రమాదానికి గురైన కోచ్‌ను రైలు నుంచి తొలగించారు. అలాగే ప్రయాణికులను కూడా వారి గమ్యస్థానాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : మళ్లీ వైసీపీలోకి అంబటి రాయుడు! ట్వీట్ వైరల్..