Train Accident : రైలులో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో కరిసాత్ స్టేషన్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి ఓ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకి దూకేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.