Telangana:నేడే తెలంగాణ బడ్జెట్

తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

Telangana:నేడే తెలంగాణ బడ్జెట్
New Update

Vote-On-Account-Budget: మరికొద్ది సేపట్లో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 9గంటలకు రాష్ట్ర కాబినెట్ సమావేశం కానుంది.
అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ వన్ లో క్యాబినెట్ భేటి కానుంది.దీనిలో బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. దాదాపు 2.72 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి మూడు నెలల కాలానికే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలు అయిపోయి...కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Also Read:KCR: నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్‌.. తొలి ప్రసంగంపై ఉత్కంఠ

మధ్యాహ్నం 12 గంటలకు...

ఇక ఇవాళ బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క చదవనున్నారు. మరోవైపు శాసన మండలిలో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే ఈసారి బడ్జెట్‌లో కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని..కొత్త ప్రతిపాదనలు ఉండవని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ లాంటి వాటికి మాత్రం కేటాయింపులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

సంక్షేమానికే పెద్ద పీట...

బడ్జెట్‌లో కూడా ఆరు పథకాల అమలు గురించి చెప్పనున్నారని తెలుస్తోంది. వీటిలో పలు పథకాలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. విద్యుత్, వ్యవసాయం, పంచాయితీ రాజ్‌తో పాటూ పలు శాఖలకు నిధులు కేటాయించనున్నారు. వాటితో పాటూ విద్య ,వైద్యం, సాగుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. మొత్తానికి సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక ఈరోజు మొట్టమొదటిసారిగా ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

#telangana #assembly #vote-on-account #bhatti-vikramarka #budget
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి