Filmfare Awards : ఆర్‌ఆర్‌ఆర్‌ కి అవార్డుల పంట.. మెరిసిన సీతామహాలక్ష్మి!

2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు.బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా 7 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వచ్చాయి. ఆల్‌ టైం క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు వరించగా..నక్సల్‌ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ వచ్చాయి.

Filmfare Awards : ఆర్‌ఆర్‌ఆర్‌ కి అవార్డుల పంట.. మెరిసిన సీతామహాలక్ష్మి!
New Update

68th Filmfare Awards South Telugu : 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని ఈ అవార్డులను అందజేయనున్నారు. తెలుగు బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాకు ఏకంగా 7 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వచ్చాయి. ఆల్‌ టైం క్లాసిక్ హిట్ ‘సీతారామం’కు 5 అవార్డులు వరించగా.. నక్సల్‌ నేపథ్యంలో వచ్చిన ‘విరాట పర్వం’కు 2 అవార్డ్స్ వచ్చాయి.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 తెలుగులో ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్) విభాగంలో సీతారామం అవార్డు గెలుచుకోగా.. ఉత్తమ దర్శకుడుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఎంపికయ్యారు. ఉత్తమ నటుడు విభాగంలో రామ్ చరణ్, జూ ఎన్టీఆర్.. ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నిలిచారు. ఉత్తమ సహాయ నటుడిగా రానా దగ్గుబాటి, ఉత్తమ సహాయ నటిగా నందితా దాస్ ఈ అవార్డులను గెలుచుకున్నారు.

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నవారి లిస్ట్ ఓసారి చూద్దాం.

ఉత్తమ సినిమా – ఆర్ఆర్ఆర్, ఉత్తమ నటుడు – రామ్ చరణ్ (Ram Charan), జూ. ఎన్టీఆర్ (Jr. NTR) (ఆర్ఆర్ఆర్),ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – దుల్కర్ సల్మాన్ (సీతారామం), ఉత్తమ నటి – మృణాల్ ఠాకుర్ (సీతారామం), ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ మూవీ (క్రిటిక్స్) – సీతారామం, ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయిపల్లవి (విరాటపర్వం), ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్), ఉత్తమ సహాయ నటి – నందితా దాస్ (విరాటపర్వం), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – కీరవాణి (ఆర్ఆర్ఆర్), ఉత్తమ లిరిక్స్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి – (కానున్న కల్యాణం – సీతారామం), ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) – కాల భైరవ (-కొమురం భీముడో – ఆర్ఆర్ఆర్), ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) – చిన్మయి (ఓ ప్రేమ – సీతారామం), ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు – ఆర్ఆర్ఆర్),ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)

Also read: గాలిలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం!

#rrr-movie #ram-charan #ss-rajamouli #jr-ntr #filmfare-awards #mrunal-thakur
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి