Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత నవీన్‌ యర్నేని హస్తం ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు గుర్తించారు. తనను కిడ్నాప్ చేసి, తన కంపెనీ షేర్లు బదాలియించుకున్నారంటూ క్రియా హెల్త్‌కేర్‌ డైరెక్టర్‌ చెన్నుపాటి వేణుమాధవ్‌ ఫిర్యాదు చేయగా 34సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు!
New Update

Phone Tapping Case : ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో టాలీవుడ్‌(Tollywood) కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) అధినేత నవీన్‌ యర్నేని(Naveen Yerneni) హస్తం ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ మేరకు అక్రమ ఫోన్‌ ట్యాపింగ్, వ్యాపారుల పట్ల బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుతో పాటు ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌పై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కిడ్నాప్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా నిందితుల జాబితాలో నవీన్ ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

కిడ్నాప్‌ చేసి కంపెనీ షేర్లు బదలాయింపు..
ఈ మేరకు ఫోన్‌ ట్యాపింగ్ వివాదం గురించి క్రియా హెల్త్‌కేర్‌(Kriya Health Care) డైరెక్టర్‌ చెన్నుపాటి వేణుమాధవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో చిక్కుకున్న వారిలో కొంతమంది తనను కిడ్నాప్‌ చేసి తనకు సంబంధించిన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. ప్రాణభయంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వేణుమాధవ్‌.. రాధాకిషన్‌రావు అరెస్టు అవగానే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్‌ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Deepika Padukone : ఎట్టకేలకు ప్రియుడి టాటూ తొలగించిన దీపిక.. పోస్ట్ వైరల్!

లీగల్ నోటీసులు..
హైదరాబాద్‌(Hyderabad) కు చెందిన వేణుమాధవ్‌ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్‌ సంస్థను స్థాపించారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు పార్ట్‌టైమ్‌ డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు తాజాగా ఫిర్యాదులో వేణుమాధవ్‌ పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న నిర్మాత నవీన్‌ యర్నేని, గోపాలకృష్ణ సూరెడ్డి,రాజ్‌ తలసిల, రవికుమార్‌ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్‌రావులను నిందితుల జాబితాలో తాజాగా చేర్చగా.. వారందరికీ నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

#hyderabad #phone-tapping-case #producer #naveen-yerneni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe