దీపావళి రోజే దారుణం.. ప్రేమించి పెళ్లాడిన భార్యను ఏం చేశాడంటే

దీపావళి రోజే ప్రేమించి పెళ్లాడిన భార్యను హతమార్చాడు ఓ దుర్మార్గుడు. అద్దె ఇళ్లు మారే విషయంతోపాటు ఇతర పనులకు అడ్డు చెబుతుందనే కోపంతో భార్య స్రవంతిని కొట్టి చంపాడు మహేందర్. ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని మంచంకింద దాచాడు. ఈ ఘటన నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

దీపావళి రోజే దారుణం.. ప్రేమించి పెళ్లాడిన భార్యను ఏం చేశాడంటే
New Update

అద్దె ఇళ్లు మారే క్రమంలో తలెత్తిన గొడవలో ప్రేమించి పెళ్లాడిన భార్యను హతమార్చాడు ఓ దుర్మార్గుడు. ఆమె ముఖంపై, తలపై బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో మెడకు చున్నీ చుట్టీ మృతురాలిని మంచం కింద దాచి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

ఈ మేరకు నేరేడ్‌మెట్‌ సీఐ శివకుమార్‌, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన ఎ.స్రవంతి(22), సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ శ్రీగిరిపల్లికి చెందిన మహేందర్‌లు 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేందర్ వృత్తి రిత్యా కారు డ్రైవర్‌. కాగా వీరికి మూడేళ్ల కూతురు ఉంది. అయితే కొంతకాలంగా ఉప్పల్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లోని కందిగూడలో ఉన్నారు. ఈ క్రమంలోనే మహేందర్‌ ఓకేసులో జైలుకు వెళ్లాడు. దీంతో ఇటీవలే భర్తను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చింది స్రవంతి. ఈ క్రమంలోనే ఉప్పల్ నుంచి నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని సమతానగర్‌కు రూమ్ మార్చారు. అయితే ఈ బెయిల్ కోసం ఖర్చు అయిన డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరగుతున్నాయి. ఆర్థిక సమస్యలకు తోడు మహెందర్ ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో గొడవ మరింత పెద్దదైంది. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు, గొడవలు చోటుచేసుకోవడంతో స్రవంతి చాలా రోజులుగా తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది.

Also read : ఆ కుటుంబంలో చీకట్లను నింపిన దీపావళి.. కళ్లముందే కవలల దుర్మరణం.. కోమాలోకి తల్లి!

అయితే దీపావళి రోజు శనివారం రాత్రి భార్య స్రవంతికి ఫోన్‌ చేసిన మహేందర్‌.. ఆదివారం ఉదయం ఇళ్లు ఖాళీ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో వెంటనే సమతానగర్‌లో అద్దె ఇంటికి స్రవంతి చేరుకోగా వస్తువులన్నీ మూట కట్టేశాడు. కానీ ఇళ్లు కాళీ చేసేందకు స్రవంతి ఒప్పుకోలేదు. మహెందర్ తో చాలా గొడవపడింది. అది కాస్త కొట్టుకునేదాకా వచ్చింది. ఈ క్రమంఓలనే స్రవంతి ముఖంపై, తలపై బలంగా కొట్టాడు మహెందర్. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన స్రవంతి మెడకు చున్నీ చుట్టి ఈడ్చుకెళ్లి మంచం కింద దాచాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు అనుమానం వచ్చిన స్రవంతి అన్న ప్రశాంత్‌ ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అనుమానం వ్యక్తం చేశాడు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడటంతో అప్పటికే స్రవంతి చనిపోయింది. వెంటనే సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

#fight #killed #wife #husband #rent-house
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe