Khammam: ఖమ్మంలో నడిరోడ్డుపై గ్యాంగ్‌ వార్‌.. సీపీ సీరియస్

రెండు గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాట ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసింది. మద్యం మత్తులో రేవతి, తెల్దారుపల్లి యూత్‌ గ్యాంగ్‌ ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. అడ్డు వచ్చిన SI పై దాడి చేయగా.. ఆయనకు గాయాలు అయ్యాయి. దీనిపై సీపీ సునీల్‌దత్ సీరియస్ అయ్యారు.

Khammam: ఖమ్మంలో నడిరోడ్డుపై గ్యాంగ్‌ వార్‌.. సీపీ సీరియస్
New Update

Khammam News: మద్యం మత్తులో ఖమ్మం ఖమ్మంలో నడిరోడ్డుపై రెండు గ్యాంగులు పొట్టు పొట్టు కొట్టుకున్నాయి. రేవతి గ్యాంగ్‌ Vs తెల్దారుపల్లి యూత్‌ గ్యాంగ్‌ అనే రెండు గ్యాంగ్‌లు కర్రలు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్లాటలో గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఆస్పత్రి దగ్గరకు వచ్చిన రేవంతి సెంటర్‌ గ్యాంగ్‌ కర్రలతో తెల్దారుపల్లి గ్యాంగ్‌పై దాడికి దిగింది.

గొడవను ఆపేందుకు అడ్డొచ్చిన ఖమ్మం రూరల్‌ SI సురేష్‌పై దాడికి దిగారు. దీంతో ఎస్సైకి గాయాలు అయ్యాయి. జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు సీపీ సునీల్‌దత్. దాడికి పాల్పడిన రేవతి సెంటర్ గ్యాంగ్ కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తుసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ: రూ.25లక్షలు.. ఆపై ప్రతీ నెలకు రూ.25వేల పెన్షన్‌.. పద్మ అవార్డు విన్నర్‌లకు గుడ్‌న్యూస్‌!

మద్యం ఇచ్చిన కిక్కే..

ప్రస్తుత కాలంలో మద్యానికి నేటి యువత బానిస అయిందనే దానికి పైన జరిగిన ఘటన ఒక ఉదాహరణ. మద్యం మత్తులో ఏం చేస్తున్నారనే ఆలోచలన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు కొందరు. మద్యం మత్తులో యువకులు ప్రాణాలు తీసిన ఘటనలు... ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎక్కువగా మనం వార్తల్లో చూసుంటాం. దీనికి ప్రధాన కారణం మందు.. ఊరి అవుతల ఉండాల్సిన వైన్స్ లు ఏకంగా ఊర్లోకే వచ్చేశాయి. దీని కారణంగా చాలా మందికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు దొరుకుతుంది.. ఆ తరువాత ఆ మద్యం మత్తు ఎన్నో ఘోరాలకు దారి తీస్తోంది. ఇటీవల కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో బెల్ట్ షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. మరి దీన్ని వంద శాతం అమలు చేస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

DO WATCH: 

#khammam #crime-news #khammam-news #gang-war-in-khammam #khammam-cp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe