Khammam: ఖమ్మంలో నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. సీపీ సీరియస్
రెండు గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాట ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసింది. మద్యం మత్తులో రేవతి, తెల్దారుపల్లి యూత్ గ్యాంగ్ ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. అడ్డు వచ్చిన SI పై దాడి చేయగా.. ఆయనకు గాయాలు అయ్యాయి. దీనిపై సీపీ సునీల్‌దత్ సీరియస్ అయ్యారు.