PM Modi: పన్నూ హత్య కుట్రమీద మొదటిసారి స్పందించిన భారత ప్రధాని మోదీ.

ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయులు అమెరికాలో కుట్ర చేసినట్లు వస్తున్న ఆరోపణల మీద తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు. ఇతర దేశాల్లో భారతీయుల చేసిన వాటి గురించి వివరాలను ఇస్తే..విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

PM Modi : ఢిల్లీలో రైతుల నిరసన.. ప్రధాని మోడీ కీలక ట్వీట్
New Update

PM Modi reacts to Pannun murder: భారతదేశ పౌరులు ఇతర దేశాల్లో ఏదైనా తప్పు చేసినట్లు మాకు పూర్తి సమాచారం ఇస్తూ వెంటనే విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ప్రధాని మోదీ. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...భారత్-అమెరికాల (India - America) మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో పన్నూ హత్య కేసును (Pannun Murder Case) ముడిపెట్టడం భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. చట్టానికి అనుగుణంగా మా ప్రభుత్వం పని చేస్తుందని...దానికి ఎప్పుడూ కట్టుబడే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. భావప్రకటనా స్వేఛ్చతో కొంతమంది విదేశాల్లో ఉగ్రవాద గ్రూపులను నడుపుతున్నారు. హింసను ప్రేరేపిస్తున్నారు. ఇది మాకు కూడా చాలా ఆందోళన కలిగించే విషయమే అని మోదీ చెప్పారు.

Also read:భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హ్యకు కుట్ర అమెరికాలోనే జరిగిందంటూ యూఎస్ అటార్నీ రీసెంట్గా ఆరోపించింది. ఆ కుట్రను తామ భగ్నం కూడా చేశామని తెలిపింది. భారత్ కుచెందిన నిఖిల్ గుప్తా ప్రమేయం ఇందులో ఉందంటూ వివరాలు చెప్పింది. నిఖిల్ కు భారతదేశంలోని ఓ అధికారి నుంచి ఆదేశాలు వచ్చాయని కూడా చెప్పారు. ఈ ఆరోపణల మీదనే ఇప్పుడు ప్రధాని మోదీ స్పందించారు. యూఎస్ ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణిస్తుందని...ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని వేసి మరీ విచారణ జరిపిస్తామని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. నిఖిల్ గుప్తాను ఇప్పటికే చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అప్పగించాలని అమెరికా, చెక్ రిపబ్లిక్ ను అడుగుతోంది.

#us #khalistan #america #pm-modi #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe