Crows: ఆ దేశంలో కాకులను అంతం చేయాలని నిర్ణయం.. ఎందుకంటే ? ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా, సోమాలియ వంటి తూర్పుతీర దేశాల్లో కాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కెన్యా దేశం ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల కాకులను అంతం చేయాలని నిర్ణయించుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Jun 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Kenya: అంటార్కిటికాలో తప్ప దాదాపు అన్ని దేశాల్లో కూడా కాకులు ఉన్నాయి. ఏదైనా తినేది దొరికిందంటే చాలు.. ఒక కాకి చేసే సైగతో చుట్టుపక్కల ఉన్న అన్ని కాకులు కావ్, కావ్ అంటూ అక్కడికి వచ్చి వాలిపోతాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో కాకులు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా, సోమాలియ వంటి తూర్పుతీర దేశాల్లో మాత్రం కాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వాటివల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కెన్యా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పూర్తయ్యేనాటికి దాదాపు పది లక్షల కాకుల్ని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా నుంచి వలస కెన్యాలో దేశంలో కాకులు.. టూరిస్టుల ప్లేట్లలోనుంచి ఫుడ్‌ను ఎత్తుకెళ్తున్నాయి. పంటలపై దాడులు చేస్తున్నాయి. చెట్లపై ఉండే పండ్లను నాశనం చేస్తున్నాయి. అలాగే స్థానికంగా ఉండే పక్షి జాతులను తరిమేసి పౌల్ట్రీ, గుడ్లు లాంటి పశుజీవన విధానంపై కూడా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కెన్యా ప్రభుత్వం.. తమ దేశంలో కాకుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అయితే 19వ శతాబ్దంలో ఇండియా నుంచి 'ఇండియన్ హౌస్ క్రౌ' (Indian House Crows) అనే పక్షి జాతి కెన్యా, టాంజానియా లాంటి తూర్పుతీరు దేశాలకు వలస వచ్చింది. ఈ కాకులే అక్కడ ఆర్థిక, జీవవైవిధ్య నష్టాలకు కారణంమైంది. ఒక స్టడీ ప్రకారం.. టాంజానియాకు సమీపంలో ఉన్న జంజిబార్ అనే ప్రాంతంలో మొత్తం మొక్కజొన్న ఉత్పత్తిలో 12.5 శాతం ఇండియన్ హౌస్ క్రౌల వల్లే నష్టపోయింది. పర్యావరణంపై ప్రభావం కెన్యాలో కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితే ఉంది. రైతులు, హోటల్ వ్యాపారులు బహిరంగంగా నిరసనలు వ్యక్తం చేయడంతోనే తాము కాకులను అంతం చేయాలని నిర్ణయించుకున్నామని కెన్యా వైల్డ్ లైఫ్, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ తెలిపారు. అంతేకాదు ఈ కాకులు తమ దేశంలో ఉండే స్కార్లీ బాబ్లర్స్, పైడ్ క్రౌస్, మౌస్ కలర్డ్ సన్‌బర్డ్స్, వీవర్ బర్డ్స్ లాంటి స్థానిక పక్షులను, వాటి గుడ్లను వేటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి స్థానిక పక్షి జాతులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని.. పర్యావరణానికి ఇది మంచిది కాదని తెలిపారు. పంటలకు, మొక్కలకు నష్టం దేశీయ పక్షుల సంఖ్య తగ్గిపోతే.. ఇది అక్కడ పర్యవణ క్షీణతకు దారి తీస్తుందని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కాకులకు.. ఆహారంగా ఉండే తెగుళ్లు, కీటకాలు విస్తరించడం ప్రారంభిస్తాయని.. దీనివల్ల పంటలకు, మొక్కలకు నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అలాగే మనుషులకు వివిధ రకాల వ్యాధులు కూడా వస్తాయని చెబుతున్నారు. అయితే కెన్యా ప్రభుత్వం ఇలాంటి ఆక్రమణ పక్షి జాతుల్ని నియంత్రించాలని అనుకోవడం ఇది మొదటిసారిది కాదు. రెండు దశాబ్దాల క్రితమే వాటిని అంతం చేసేందుకు అంతం చేసేందుకు చర్యలు తీసుకుంది. దీంతో కాకుల సంఖ్య మొదట్లో క్రమంగా తగ్గిపోయినప్పటికీ.. వాటికి అనుకూల వాతావరణం వల్ల కాలక్రమేణా వీటి సంఖ్య పెరిగింది. కాకులు చాలా తెలివైనవి ఇప్పటివరకు ఇండియా వెలుపల దాదాపు 30 దేశాల్లోని తీరప్రాంతాల్లో కాకులు ఉన్నాయి. ఎందుకంటే మానవ వ్యర్థ పదార్థాలే వాటి ప్రధాన ఆహారం. మనుషులు ఉన్నంతవరకు ఉష్ణ, శీతల వాతావరణాల్లో అవి జీవించగలుగుతాయి. అంతేకాదు కాకులకు చాలా తెలివి కూడా ఉంటుంది. ఇవి మనుషుల మోహాలను గుర్తుపడతాయి. సంక్లిష్ట సమస్యలను పరిష్కరిస్తాయి. వాటికి హాని కలిగించే వాటిపై పగ కూడా పెంచుకుంటాయి. అలాగే అవి గుంపులుగా జీవిస్తుంటాయి. ఈ లక్షణమే వాటిని క్రూరమైన వలసవాదులుగా చేస్తాయి. అయితే ఈ హౌస్ కాకులు ఒక టీమ్‌గా పనిచేస్తాయి. బాతులు, కోళ్లపై దాడులు చేసి వాటి తల్లులను పిల్లల నుంచి వేరుచేస్తాయి. మరో గ్రూప్ కాకులు ఆ కోడిపిల్లలు, బాతు పిల్లలు, గుడ్లను వేటాడుతాయి. ఇలాంటి ప్రత్యేకమైన వేటాడే గుణంతో అవి తమ అధిపత్యాన్ని చూపిస్తుంటాయి. కెన్యాలోని స్థానిక పక్షులకు.. కాకులు అంటేనే హడలెత్తిపోతాయి. కాకుల జీవిత కాలం 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. ప్రత్యేక సంరక్షణలో అవి 30 ఏళ్ల వరకు జీవిస్తాయి. #telugu-news #africa #kenya #birds #crows #house-crow మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి