Crime: కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష.. కేరళ కోర్టు సంచలన తీర్పు 16 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడిన 2022 కేసులో కేరళ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పొక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది. By srinivas 26 Jan 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Kerala: మైనర్ కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడిన కేసులో కేరళ కోర్టు (Kerala court) సంచలన తీర్పు వెల్లడించింది. కన్నబిడ్డనే కాటేసిన దుర్మార్గుడికి తగిన శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం తుది విచారణ చేపట్టిన ఫాస్ట్‌ట్రాక్ (Fast track) స్పెషల్ కోర్టు-2 పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడిన నేరానికి 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో సంఘటన.. ఇక వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలోని కలికావు పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల వ్యక్తి ముగ్గురు మహిళలను పెళ్లిచేసుకోగా.. అందులో ఒక భార్య కుతురి (16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనేకసార్లు ఆమెను బెదిరించి దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా గతంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. 150 ఏళ్లు శిక్ష.. అయితే ఈ కేసును శుక్రవారం విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. పోక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు శిక్ష విధించింది.16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఐపీసీ 376 (3) కింద 30 ఏళ్లు, 16 ఏళ్లలోపు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినందుకు పోక్సో చట్టంలోని సెక్షన్ 4(2) కింద 30 ఏళ్లు శిక్ష విధించింది. ఇది కూడా చదవండి: Chiru: మెగా హీరో.. ‘పద్మ విభూషణ్’ చిరంజీవి ప్రస్థానమిదే! భారీ జరిమానా.. అంతేకాదు పదే పదే చిన్నారిపై లైంగిక దాడి పాల్పడినందుకు, కుటుంబ సభ్యుడే ఈ అత్యాచారానికి పాల్పడిన నేరానికి పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 40+40 ఏళ్లు చొప్పున శిక్ష వేసింది. జువైనల్ యాక్ట్ కింద గృహంలోకి అక్రమంగా చొరబడినందుకు 7 ఏళ్లు, చిన్నారిపై క్రూరంగా వ్యవహరించినందుకు మూడేళ్లు కలిపి 10 ఏళ్లు శిక్ష అమలు చేయబోతున్నట్లు తెలిపింది. నిందితుడు రూ.4 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని, అందులో రూ.2 లక్షలు బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారందరినీ కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయంటున్నారు. #kerala #father #rape-case #doughter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి