/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
Train Accident In Medchal District :మేడ్చల్ జిల్లా (Medchal District) గౌడవెల్లి రైల్వే స్టేషన్ ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ అనే వ్యక్తి రైల్వే ట్రాక్ చెకర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం కావడంతో తన ఇద్దరు కూతర్లను తాను పనిచేస్తున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. కృష్ణ పనిచేస్తుండగా.. పిల్లలు పట్టాలపై ఆడుకుంటున్నారు.
Also Read : నిర్మాణంలో కైగా పవర్ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ?
అయితే ఒక్కసారిగా వాళ్లు ఆడుకుంటున్న పట్టాల పైకి ట్రైన్ దూసుకొచ్చింది. దీంతో తన ఇద్దరు కూతుళ్లను కాపాడేందుకు కృష్ణ పరిగెత్తుకొచ్చాడు. ఈ ప్రమాదంలో కృష్ణతో పాటు ఇద్దరు కూతుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తండ్రి, కూతుళ్ల మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read : నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేశాడు.. చివరికి
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg )
 Follow Us
 Follow Us