మధ్యప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఆరు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. పొగ మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

New Update
మధ్యప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

Road accident : మ‌ధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాష్ట్రంలో ఘెర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేంగంగా వచ్చిన ట్రక్కు ముందున్న కారును ఓవర్ టేక్ చేసేందకు ప్రయత్నించే క్రమంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందున్న వాహనాలను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆరు వాహనాలు ఒకేసారి ఒకదానిని ఒకటి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి అక్కడిక్కడే నలుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.

ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఈ ప్రమాదం సంభవించింది. ఆగ్రా-ముంబయి (Agra-Mumbai) జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ద‌ట్టమైన పొగ మంచు కప్పేసింది. అయితే ఈ వెలుతురు లేమిలోనే అవసరానికి మించిన వేగంతో వెళ్తు్న స్క్రాప్‌ లోడ్‌తో ఉన్న లారీ ముందున్న కారును ఓవ‌ర్ టేక్ చేయ‌బోయింది. ఈ క్రమంలో ట్రక్కు కారును ఢీకొట్టడంతో ఆ కారు వేగంగా ముందుకెళ్లి మరిన్ని వాహనాలను తగలడంతో ఒకదానిపై ఒకటి కుప్పలుగా పడ్డాయి. దీంతో డీజిల్ ట్యాంకులు పెలి మంటలు అంటుకోవడంతో ఆరు వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలు వారి కుమార్తెలు ఉన్నట్లుగా సమాచారం. కాగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి : తెలంగాణకు పసుపు హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు వాతావరణం

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. రాజ్‌ఘ‌ర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విజిబిలిటీ స‌రిగా లేక‌పోవ‌డం కార‌ణంగానే ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు