మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ లారీ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఆరు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. పొగ మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.