/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Home-jpg.webp)
Madhya Pradesh Bulldozer News: ఈ మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్నవారి ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చేసిన సంఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు (MP High Court) విచారణ చేసింది. క్రిమినల్ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బల్డోజర్‌తో పడగొట్టించడంపై కఠిన వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి నియమ నిబంధనలు తీసుకోకుండా చర్యలు తీసుకోవడం పురపాలక అధికారులకు ఫ్యాషన్‌గా మారిందని పేర్కొంది.
ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ లంగ్రి అనే వ్యక్తి ఓ ఆస్తి వివాదంలో ఒక వ్యక్తిని బెదిరించి అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు, పురపాలక అధికారులు కలిసి రాహుల్‌కు చెందిన రెండంతస్తుల భవనాన్ని కూల్చేశారు. దీంతో రాహుల్ భార్య రాధ హైకోర్టును ఆశ్రయించింది.
Also Read: అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు.. 60 మంగల సూత్రాలు చోరీ..
అలా కూల్చేయడం తప్పు
ఈ భవనంపై చర్యలు తీసుకునేటప్పుడు.. దాని మాజీ యజమాని రైసాబీ పేరిట అధికారులు నోటీసులు పంపిచారనని ఆమె ఆరోపించారు. తమ ఇళ్లు అక్రమనిర్మాణం కాదని తెలిపారు. ఆ ఇల్లు హౌసింగ్ బోర్డులో నమోదైందని.. ఇందుకోసం బ్యాంకు రుణం కూడా తీసుకున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై విచారణ పూర్తైన తర్వాత జస్టీస్ వివేక్ రుసియా (Justice Vivek Rusia) తీర్పునిచ్చారు. ఇంటి కూల్చివేయడాన్ని తప్పుగా అభివర్ణించారు.
పరిహారం చెల్లించండి
నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కూల్చడం.. ఆ తర్వాత వాటిని పేపర్లో పబ్లిష్ చేయించుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందంటూ జస్టీస్ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ ఇంటిని కూల్చే బదులు రెగ్యులరైజ్ చేయించుకోవాల్సిందిగా సూచించాలని అన్నారు. అన్ని అవకాశాలు ఇచ్చాక చివరి ఆప్షన్ కింద కూల్చివేత మార్గాన్ని ఎంచుకోవాలని సూచనలు చేశారు. ఈ కేసులో రాధకు రూ.లక్ష, ఆమె అత్త విమలా గుర్జర్‌కు మరో రూ.లక్ష పరిహారం కింద ఇవ్వాలంటూ ఆదేశించారు. అలాగే ఇంటిని కూల్చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుతో మంజూరుచేసిన పరిహారంపై బాధిత మహిళ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కూడా తాము అప్పీల్ చేస్తామని అన్నారు.
Also read: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్ చేసిన విపక్షాలు