Etala Rajender: బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట

బీజేపీ పార్టీ రైతులకు పెద్దపీట వేయబోతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తామన్నారు. అతి త్వరలో మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామని ఈటల తెలిపారు.

New Update
Eatala Rajender: మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్ళగలం.. ఈటల మాస్ వార్నింగ్!

బీజేపీ పార్టీ రైతులకు పెద్దపీట వేయబోతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తామన్నారు. అతి త్వరలో మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్‌.. కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ముందు వచ్చి లేనిపోని హామీలు ఇచ్చి వెళ్తుంటారని, కానీ ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీల గురించి పట్టించుకోరని విమర్శించారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న ఆయన.. విజయం సాధించిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేక పోయిందన్నారు. అక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ తెలంగాణలో గ్యారెంటీ కార్డులు ఇస్తే ప్రజలు నమ్ముతారా అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఎన్ని ఎత్తుగడలు వేసినా అధికారంలోకి రాదని ఈటల రాజేందర్‌ అన్నారు. మరోవైపు బీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్‌ రాష్ట్రంలో పేదలకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదన్నారు. సీఎం దళితులకు ఓ స్కీమ్‌, బీసీలకు ఓ స్కీమ్‌ అంటూ కబుర్లు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అవినీతి బండారం బయట పడిందన్న ఈటల.. రానున్న రోజుల్లో అవినీతి సీఎంను ప్రజలు గద్దె దించుతారని స్పష్టం చేశారు. రుణమాఫీ డబ్బులు ఇచ్చేందుకు ఇంకా సమయం ఉన్నా సీఎం కేసీఆర్‌ ముందే టెండర్లను ఎందుకు పిలిచారని ఈటల ప్రశ్నించారు.

మరోవైపు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ కావడం చాలా సంతోషంగా ఉందని ఈటల తెలిపారు. దేశ చరిత్రలో మొదటి సారి మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిందన్నారు. దీంతో చట్ట సభల్లో మహిళలకు అవకాశం దక్కనుందన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును పాస్ చేయించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీన్ని బట్టి బీజేపీకి మహిళలపై ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని బిల్లులను ఆమోదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు