Delhi Metro: రైతుల ఉద్యమం పుణ్యమా అంటూ ఢిల్లీ మెట్రో రికార్డు సృష్టించింది!

రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు.

Delhi Metro: రైతుల ఉద్యమం పుణ్యమా అంటూ ఢిల్లీ మెట్రో రికార్డు సృష్టించింది!
New Update

Delhi Metro: గత కొద్ది రోజులుగా రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన వ్యక్తం (Farmers Protest) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam) ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని రూట్లను ట్రాఫిక్‌ అధికారులు మూసి వేసి వేరే రూట్లలో వెళ్లాలని ప్రయాణికులకు, వాహనాదారులకు సూచిస్తున్నారు.

దీంతో పది నిమిషాల ప్రయాణానికి కూడా గంటల సమయం పడుతుండడంతో విసిగి పోయిన ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజువారీ కంటే అధికంగా మెట్రోలో (Metro)  ప్రయాణించేవారు ఎక్కువ అయ్యారు. కేవలం మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు.

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్‌లో డేటాను పంచుకుంది,. గత సెప్టెంబర్‌లో సాధించిన మునుపటి రికార్డును బద్దలు కొట్టినట్లు పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 4న ఢిల్లీ మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 71.03 లక్షలు కాగా, ఆగస్టు 29, 2023 నాటికి 69.94 లక్షలు.

మంగళవారం, ఢిల్లీకి రైతుల పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో తొమ్మిది స్టేషన్లలో కొన్ని గేట్లను చాలా గంటలపాటు మూసివేసి ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను నియంత్రించింది. ప్రయాణికులు ఇతర గేట్ల ద్వారా ఈ స్టేషన్లలోకి ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి అనుమతించడం జరిగింది.

ఢిల్లీ మెట్రో జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రజా రవాణాలో ప్రధాన మార్గం అని ప్రయాణికులు నిరూపించారని DMRC ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 13న మెట్రోలోని వివిధ కారిడార్‌లలో రోజూ 71,09,171 మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారు. డేటా ప్రకారం రెడ్‌లైన్‌లో 7,57,629 మంది, ఎల్లో లైన్‌లో 19,34,568 మంది, గ్రీన్‌లైన్‌లో 3,35,350 మంది, ర్యాపిడ్ మెట్రోలో 51,910 మంది ప్రయాణించారు.

Also read:  ఇక నుంచి బుర్జ్‌ ఖలీఫా మాత్రమే కాదు.. ఈ ఆలయం కూడా: మోడీ!

#traffic-jam #social-media #delhi-metro #record #formers-protest #highest-ridership
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe