National: మళ్ళీ రైతుల పాదయాత్ర..హర్యానా నుంచి ఢిల్లీకి.. శంభు సరిహద్దును వారం రోజుల్లోగా తెరవాలని పంజాబ్-హర్యానాల ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు మళ్ళీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆపేదే లేదని వారు చెబుతున్నారు. By Manogna alamuru 12 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Farmers Protest: పంజాబ్, హర్యానా రైతుల సమస్యలు ఇంకా పరిస్కారం అవ్వనేలేదు. సరిహద్దులు మూత బడడంతో నెమ్మదించిన వారు ఇప్పుడు హర్యానా కోర్టు ఆదేశాలతో మళ్ళీ కొత్త శక్తిని పుజుకుంటున్నారు. శంభు సరిహద్దులను తెరవాలని పంజాబ్-హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అంతకు ముందు ఫిబ్రవరి 13న రైతులు భారీగా నిరసనలను ప్రారంభించడంతో హర్యానా ప్రభుత్వం దీనిని మూసివేసింది. దీంతో ఐదు నెలలుగా ఈ బోర్డర్ మూసే ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తెరు్తున్నారు. వారం రోజుల్లో దీన్ని తెరవనున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రైతులు హ్యాపీ అయ్యారు. సాన్ మజ్దూర్ మోర్చా హర్యానా కన్వీనర్, భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి రాష్ట్ర అధ్యక్షుడు జగ్బీర్ ఘసోలాతో సహా పలువులు రైతులు ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. జూలై 14 నుంచి రైతులు ఆందోళబాట పట్టాలని డిసైడ్ అయ్యారు. శంభు సరిహద్దుల నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక అదే రజు ఖానౌరీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సంజాబ్, హర్యానా రైతులు ఎదుర్కొంటున్న ఎమ్ఎస్పీ సమస్య గురించి చర్చించనున్నారు. మళ్ళీ ఉద్యమం ఎలా చేయాలి అనే అంశం మీద కూడా చర్చలు జరుగుతాయని రైతు నాయకులు చెప్పారు. అవసరమైతే దేశ వ్యాప్తంగా రైతులు ఈ ఉద్యంలో పాల్గొంటారని తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు రైతు ఉద్యమం కొనసాగుతుందని రైతుల సంఘాల నేతలు చెబుతున్నారు. Also Read:Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం #punjab #haryana #farmers #protest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి