India vs Pak: ఇదేం క్రేజ్ భయ్యా.. ఆసుపత్రుల బెడ్లు కూడా వదలడం లేదు

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానులకు పునకాలే. ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచుకు ఉండే క్రేజ్ ప్రపంచ క్రికెట్‌లో మరే ఇతర మ్యాచులకు ఉండదు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ మెగా ఈవెంట్‌లో దాయాది దేశాలు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని వారు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

India vs Pak: ఇదేం క్రేజ్ భయ్యా.. ఆసుపత్రుల బెడ్లు కూడా వదలడం లేదు
New Update

publive-image

ఈ ఏడాది డబుల్ ధమాకా..

ఇరు దేశాల సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత పదేళ్లుగా ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం మానేశాయి. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌తో పాటు ఆసియా కప్‌లో మాత్రమే మ్యాచులు ఆడుతున్నాయి. అయితే ఈ ఏడాది అభిమానులకు డబుల్ ధమాకా లభించనుంది. ఆసియా కప్‌(Asia Cup)లో సెప్టెంబర్ 2న శ్రీలంక వేదికగా భారత్-పాక్(India vs Pak) మ్యాచ్ జరగనుంది. అలాగే వన్డే ప్రపంచకప్ టోర్నీ(ODI World Cup)లో భాగంగా అక్టోబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు బరిలో దిగనున్నారు. ఈసారి వరల్డ్‌కప్‌కు భారత్ అతిథ్యం ఇవ్వడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడుతున్నారు. నరేంద్రమోదీ స్టేడియం కెపాసిటీ లక్ష మంది కావడంతో ఇప్పటికే టికెట్లు అమ్ముడుపోయాయి.

అట్లుంటది మరి.. అభిమానులతోటి..

అయితే దేశ, విదేశాల నుంచి వచ్చే అభిమానులు వసతి కోసం నానాపాట్లు పడుతున్నారు. ఇండియా-పాక్(India vs Pak) మ్యాచ్ జరిగే రోజుతో పాటు ముందు రోజు హోటల్ రూమ్స్ ధరలు భారీగా పెరిగాయి. రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అద్దెలు పెంచేశారు నిర్వాహకులు. దీంతో సామాన్యులు ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది స్టేడియం దగర్లోని ఆసుపత్రుల్లో ఉన్న బెడ్లను బుక్ చేసుకుంటున్నారు. హెల్త్ చెకప్, అనారోగ్య సమస్యల పేరుతో బెడ్లు కావాలని ఇప్పటికే ఎన్నో వినతులు వచ్చాయని హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి.

బెడ్డుతో పాటు ఫుడ్, హెల్త్ చెకప్ ఫ్రీ..

హోటల్స్‌తో పోలిస్తే ఆసుపత్రుల బెడ్లు చాలా తక్కువగా ఉంటాయి. ఆసుపత్రి స్థాయిని బట్టి ధరలు ఉంటాయి. అంతేకాకుండా బెడ్డుతో పాటు ఆహారం, మెడికల్‌ చెకప్ కూడా ఉంటోంది. అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులు ఉండే అవకాశం ఉండటంతో ఏమాత్రం ఆలోచించకుండా బెడ్లు బుక్ చేసుకుంటున్నారు. దాంతో ఆసుపత్రుల యాజమాన్యాలకు కాసుల వర్షం కురుస్తోంది. కాగా అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నీలో మొత్తం 48 మ్యాచులు జరగనున్నాయి. నవంబర్ 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుండగా..సెమీఫైనల్ మ్యాచులకు ముంబై, కోల్‌కతా అతిథ్యం ఇవ్వనున్నాయి.

#cricket #pakistan #india #bcci #icc #odi-world-cup
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe