/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T151820.243-jpg.webp)
Family Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్. పరుశురామ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యింది. అయితే కొంత మంది మాత్రం విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ కావాలనే.. సినిమా బాగోలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నెగిటివ్ పబ్లిసిటీ పై నిర్మాత దిల్ రాజ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.
మాటిచ్చిన దిల్ రాజు
ఇది ఇలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నిర్మాత దిల్ రాజ్ తో మాట్లాడిన ఓ అభిమాని.. తన కుటుంబంలో రియల్ ఫ్యామిలీ స్టార్ అతని చెల్లి అని. ఆమె దివ్యాంగురాలైనా.. ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటుందని చెప్పాడు. ఈ అభిమాని మాటలకు భావోద్వేగానికి గురైన దిల్ రాజ్.. అతని చెల్లిని ఖచ్చితంగా కలుస్తానని మాటిచ్చారు.
అభిమాని ఇంటికి వెళ్లిన ఫ్యామిలీ స్టార్ టీమ్
అయితే తాజాగా నిర్మాత దిల్ రాజ్ ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ అలాగే ఫ్యామిలీ స్టార్ చిత్ర బృదంతో కలిసి ఆ అభిమాని ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేశారు. విజయ్, దిల్ రాజ్, డైరెక్టర్ పరుశురామ్ ఆమెతో కాసేపు ముచ్చటించారు. అలాగే ఆ కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
#VijayDevaraKonda and #DilRaju good gesture to meet one of #FamilyStar
👏👏 Heart Touching, inspiring Story, #TheFamilyStar pic.twitter.com/8JPXNbH1Jr
— Telugu Bit (@telugubit) April 8, 2024
Also Read: HBD Allu Arjun: బన్నీకి డేవిడ్ వార్నర్ స్పెషల్ విషేష్.. ఇంకా ఎవరెవరు ట్వీట్ చేశారంటే..!