Nithya Menon: మలయాళ కుట్టి నిత్యామీనన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు చూడగానే ఆకట్టుకునే రూపం ఆమె సొంతం. ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ సౌందర్య అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తుంటారు ఈ భామను.
10 ఏళ్ళ వయసులోనే నటిగా మారిన నిత్యా.. హనుమాన్ అనే ఇంగ్లీష్ చిత్రంలో టబు చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత 2008లో మలయాళ చిత్రం 'ఆకాశ గోపురం' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Also Read: Vijay Devarakonda: ఇంత కసా..? ఇంత ఓర్వలేని తనమా.. ఆ బ్యాచ్ కు రౌడీ మేనమామ కౌంటర్!
ఇక 2010 లో అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు అందరినీ అలా తన వైపుకు తిప్పేసుకుంది. మొదటి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ ముద్దు గుమ్మ.
ఆ తర్వాత నితిన్ సరసన 'ఇష్క్', ‘గుండెజారి గల్లంతయ్యిందే’, 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' ఇలా బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సరసన 'భీమ్లా నాయక్', ధనుష్ సరసన 'తిరు' చిత్రాలతో మరో సారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇలా ఎన్నో సినిమాల్లో తన సోలో ఫెర్మామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన నిత్యామీనన్ పుట్టిన రోజు నేడు.
ఈ సందర్భంగా.. తాను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కోలీవుడ్ దర్శకురాలు కామిని దర్శకత్వంలో 'డియర్ఎక్స్' చిత్రంలో నటించనుంది. తాజాగా ఆమెకు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో పెళ్లి కూతురు గెటప్‌లో కనిపిస్తున్న నిత్యా మీనన్ ఒక వైపు చేతిలో డ్రింక్.. మరో వైపు ఫోన్ పట్టుకుని ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ ప్రకారం సినిమా మంచి కామెడీ ఎంటర్ టైనర్ లా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Very happy to launch the Bask Time Theatres and POPter Media Production No. 1 first look #DearEXes#HBDNithyaMenen
Featuring #NithyaMenen#VinayRai, @pnavdeep26, #DeepakParambol, @prateikbabbar
Written & Directed by debutante #Kamini.
Produced by BGN, Aditya Ajay Singh,… pic.twitter.com/CEMXM86RiY
— venkat prabhu (@vp_offl) April 8, 2024
Also Read: Narudi Brathuku Natana: ‘నరుడి బ్రతుకు నటన’.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గ్లింప్స్