Fact Check: యో-యో టెస్టులో కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఎక్కువ స్కోర్ చేశాడా?

విరాట్ కోహ్లీ(Virat Kohli) కంటే రోహిత్ శర్మ(rohit sharma) ఎక్కువ యో-యో టెస్ట్ పాయింట్లు సాధించినట్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వార్తలో నిజం లేదు. ఎందుకంటే యో-యో టెస్ట్ స్కోర్‌ వివరాలు బీసీసీఐ బయటకు చెప్పదు. ఇటివలే కోహ్లీ తన యో-యో టెస్ట్ స్కోర్‌ని 'ఇన్‌స్టా'లో పోస్ట్ చేయగా.. విరాట్‌ని మందలించింది బీసీసీఐ

New Update
Fact Check: యో-యో టెస్టులో కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఎక్కువ స్కోర్ చేశాడా?

Did Rohit Sharma Score Higher In Yo-Yo Test Than Kohli: సోషల్‌మీడియాలో వెర్రి ఫ్యాన్స్‌ ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా సినిమా స్టార్లు, క్రికెటర్లను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్‌ ఉంటారు. వీరే ఎక్కువగా ఫేక్‌ న్యూస్‌ని స్ప్రెడ్‌ చేస్తుంటారు. ఈ మిస్‌ఇన్ఫర్‌మేషన్‌ చాలా డేంజర్. చిన్నచిన్న అబద్ధాలే కదా అని లైట్ తీసుకోకూడదు.. ఎందుకే ఫేక్ న్యూస్‌ క్రియేట్ చేసే అనర్ధాలు అన్ని ఇన్ని కావు. ఇక టీమిండియాకు రెండు కళ్లు లాంటి రోహిత్ శర్మ (Rohit Sharma), కోహ్లీ (Virat Kohli) గురించి అనేక వార్తలు నిత్యం సోషల్‌మీడియాలో షికార్లు చేస్తుంటాయి. తాజాగా ఆసియా కప్‌(Asia Cup)కు ముందు రోహిత్‌ శర్మ యో-యో టెస్ట్ స్కోర్‌పై ఓ వార్త ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది. కోహ్లీ కంటే రోహిత్‌ శర్మ ఎక్కువగా యో-యో స్కోర్‌ చేసినట్టు ఆ ట్వీట్లలో ఉంది.

క్రిక్‌బజ్‌ లింగ్‌ చేస్తూ ట్వీట్‌:
యో-యో టెస్ట్ 20 పాయింట్లకు ఉంటుంది. రోహిత్‌ శర్మ 18.6, కోహ్లీ 17.2, పాండ్యా(Pandya) 16.7 స్కోర్ చేసినట్టు ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఈ డేటాను 'క్రిక్‌బజ్‌'(Cricbuzz) నుంచి తీసుకున్నట్టు రాసుకొచ్చాడు. '@Ro45Goat' అనే ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి మొదటగా ఇది పోస్ట్ అయ్యింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ యూజర్‌ ఐడి పేరు చూస్తునే రోహిత్‌ శర్మ హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌ అని అర్థమవుతుంది. కోహ్లీ కంటే రోహిత్‌కి ఎక్కువ స్కోర్ వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం ఇది. మిగిలిన రోహిత్ అభిమానులతో పాటు మరికొంత మంది దీన్ని నిజం అని నమ్మారు. కానీ ఇది అబద్ధం.

ఫేక్ అని ఎలా తేలిందంటే?
విరాట్‌ కోహ్లీ రెండు రోజుల క్రితం యో-యో టెస్ట్ రిజల్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తనకు 17.2 స్కోర్ వచ్చినట్టు పోస్ట్ చేశాడు. నిజానికి జట్టు అంతర్గత విషయాలు బయటకు చెప్పకూడదు.. కోహ్లీ ఆ పని చేయడంతో బీసీసీఐ మందలించింది. మిగిలిన వారికి కూడా ఇలాంటివి చేయవద్దని సూచించింది. కోహ్లీ ఆ పోస్టును డిలీట్ చేశాడు కూడా. ఇంత క్లియర్‌గా బీసీసీఐ చెప్పిన తర్వాత కూడా సోషల్‌మీడియాలో రోహిత్ శర్మ యో-యో టెస్టు స్కోర్‌ అంటూ ఓ న్యూస్‌ చక్కర్లు కొట్టింది. రోహిత్‌ శర్మ యో-యో టెస్టులో పాస్‌ అయ్యినట్టు ఇన్‌ఫర్‌మేషన్‌ ఉంది కానీ స్కోర్‌ గురించి ఎప్పుడూ కూడా బీసీసీఐ బయటపెట్టదు. ఇక ఒక వారం యో-యో టెస్టులో 17 స్కోర్‌ వస్తే వచ్చేవారం అంత రావాలని గ్యారెంటీ కూడా లేదు. 16.5 స్కోర్‌ దాటితే యో-యో టెస్ట్ పాస్‌ ఐనట్టు లెక్కేస్తారు. అంతే కానీ స్కోర్‌ వివరాలు బయటకు చెప్పరు. సో.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ న్యూస్‌లో వాస్తవం లేదు.

ALSO READ: విరాట్‌ కోహ్లీపై బీసీసీఐ ఫైర్‌.. ఎందుకుంటే.!

Advertisment
Advertisment
తాజా కథనాలు