/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Facebook-jpg.webp)
Facebook and Instagram Down: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలతోనే ఈ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ట్విట్టర్ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక సుమారు గంటన్నర పాటు అంతరాయం కొనసాగగా.. తర్వాత ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది. అయితే గతంలో కూడా ఇలా సోషల్ మీడియా యాప్స్ సాంకేతిక సమస్యలతో కొంత సమయం పాటు నిలిచిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
హ్యాక్ అయ్యిందా?
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకస్మాత్తుగా డౌన్ అయ్యాయని ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ తెలిపింది. రాత్రి 8:30 గంటల తర్వాత సమస్య మొదలైందని చెప్పింది. ఇక ఏం జరుగుతుందో అర్థంకాని యూజర్లు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది తమ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని భావించారు. హ్యాకింగ్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయ్యింది. అయితే హ్యాకింగ్ వార్తలను నిపుణులు కొట్టిపారేశారు.
We're aware people are having trouble accessing our services. We are working on this now.
— Andy Stone (@andymstone) March 5, 2024
గతంలోనూ ఇంతే:
2021లో మెటాకు చెందిన సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌లో అంతరాయం ఏర్పడింది. అక్టోబర్ 4, 2021లె ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌తో సహా అన్ని మెటా సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సుమారు 4 గంటలు డౌన్ అయ్యాయి.
టెక్ ఎక్స్‌పర్టులు ఏం అంటున్నారు?
ఫేస్బుక్, ఇన్‌స్టా డౌన్ అవ్వడం గురించి గురించి భయపడకండని చెప్పారు టెక్ నిపుణులు శ్రీధర్ నల్లమోతు. ఒక కొత్త ఫీచర్ ప్రయోగత్మక దశలో ఉండడంతో చాలామందికి ఫేస్బుక్ లాగవుట్ అయిందని.. అంతే తప్పించి దీని గురించి భయపడాల్సిన పనిలేదన్నారు.
24 గంటలుగా ఇదే జరుగుతోందా?
డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం, 62 శాతం మంది వినియోగదారులు 24 గంటల్లో ఫేస్‌బుక్ యాప్‌లో కంటెంట్‌ను లోడ్ చేయలేని సమస్యను ఎదుర్కొన్నారు. అదే సమయంలో 28 శాతం మంది ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి ఇబ్బంది పడ్డారు. 10 శాతం మంది యూజర్లు అప్ లోడింగ్ సమస్యలను నివేదించారు.
If you’re reading this post, it’s because our servers are working
— Elon Musk (@elonmusk) March 5, 2024