Chia Seeds: చియా విత్తనాలతో చర్మ సంరక్షణ.. ఇలా ఫేస్‌ మాస్క్‌ చేసుకోండి

చియా విత్తనాలు శరీరానికి అంతర్గతంగా మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలతో మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని కూడా పొందవచ్చు. చియా సీడ్ ఫేస్ మాస్క్‌ను వాడితే చర్మానికి పోషణ లభించడంతో పాటు చర్మానికి పునరుజ్జీవం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Chia Seeds: చియా విత్తనాలతో చర్మ సంరక్షణ.. ఇలా ఫేస్‌ మాస్క్‌ చేసుకోండి
New Update

Chia Seeds: చియా విత్తనాల ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. శరీరాన్ని లోపల నుంచి నిర్విషీకరణ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కేవలం శరీరానికి అంతర్గతంగా మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలతో మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని కూడా పొందవచ్చు. చియా సీడ్ ఫేస్ మాస్క్‌ను వాడితే చర్మానికి పోషణ లభించడంతో పాటు చర్మానికి పునరుజ్జీవం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఫేస్ మాస్క్‌కి కావాల్సినవి:

  • 2 టేబుల్ స్పూన్లు చియా విత్తనాలు, 4 టేబుల్ స్పూన్లు నీరు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టీస్పూన్ నిమ్మరసం

మాస్క్ తయారు చేసే విధానం:

  • ఒక చిన్న గిన్నెలో చియా గింజలను నీటిలో నానబెట్టాలి. 15 నిమిషాలు నానిన తర్వాత జెల్‌లా వస్తుంది. అదులో తేనె, నిమ్మరసం కలపాలి. తేనె సహజ హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది. ఇది తేమను నిలుపుకుంటుంది. అయితే నిమ్మరసం స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. అన్ని పదార్ధాలను బాగా కలిపిన తర్వాత వేళ్లు లేదా బ్రష్ సహాయంతో చియా సీడ్స్ ఫేస్ మాస్క్‌ను ముఖంపై అప్లై చేయాలి. అయితే మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత దానిపై మాస్క్‌ను సమానంగా వేయాలి. కళ్ల చుట్టూ జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌ సుమారు 15-20 నిమిషాలు లేదా ఆరిపోయే వరకు ఉంచాలి. మాస్క్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత రౌండ్‌గా సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఏ రకమైన మాస్క్‌ను అప్లై చేసినా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: బట్టలపై మొండి మరకలను పోగొట్టె చిట్కాలు.. నిమిషాల్లో మరక మాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #health-care #best-health-tips #chia-seeds
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe