Telangana : తెలంగాణలో అత్యధిక చలి...20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు

తెలంగాణలో చలి కుమ్మేస్తోంది. రోజురోజుకూ చలిగాలులు తీవ్రతరం అయిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా రానున్న రెండు రోజుల్లో ఇక్కడ మరింత చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది.

New Update
Winter Health Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక పాటించాల్సిన హెల్త్ టిప్స్ ఇవే!

Telangana : తెలంగాణ(Telangana) లో ఎప్పుడూ లేనంతగా చలి(Cold) ఉంటోంది. ఉదయం పూట పగటి ఉష్ణోగ్రతలు బాగానే ఉంటున్నా పెద్దగా ఏమీ తెలియడం లేదు. ఇక రాత్రి మాత్రం చలితో తెలంగాణ వాసులు గజగజా వణికిపోతున్నారు. దీనికి తోడు ఈరోజు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు స్వల్పంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather) అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also read:కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో ఆధిపత్యపోరులో రెండు పులులు మృతి..

తెలంగాణలో చలి ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉదయం పూట పొగమంచు దట్టంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని...దీని వలన పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని తెలిపారు.

నిన్న అత్యధిక స్వల్ప ఉష్ణోగ్రతలు...

మరోవైపు నిన్న దేశంలోని 20 రాష్ట్రాల్లో అత్యధిక స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. దీనివలన జమ్మూ కాశ్మీర్, లడఖ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మణిపూర్ సహా 20 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలలో ఈరోజు దట్టమైన పొగమంచు అలుముకుంది. ఇక డిల్లీ(Delhi) లో మంగళవారం ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ సీజన్‌లో ఢిల్లీలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. దట్టమైన పొగమంచు వలన దేశ వ్యాప్తంగా రైలు , విమాన సర్వీసులు ఆలస్యంగా నుడుస్తున్నాయి. ఢిల్లీలో 80 ట్రైన్ల రాకపోకల మీ పొగమంచు ప్రబావం చూపించింది. రైళ్లు 1-6 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Also Read:ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం..రెండు రోజుల పాటు పర్యటన

Advertisment
Advertisment
తాజా కథనాలు