ఖలిస్తాని బెదిరింపులు..ఆ ఎయిర్‌ పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం!

నవంబర్‌ 19 న ఎయిర్‌ ఇండియాలో ప్రయాణించే సిక్కులకు ప్రమాదం ఉందని ఖలిస్తాని ఉగ్రవాది హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పంజాబ్‌, ఢిల్లీ ఎయిర్‌ పోర్టులకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ భద్రతను పెంచారు.

New Update
ఖలిస్తాని బెదిరింపులు..ఆ ఎయిర్‌ పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం!

ఖలిస్తాన్‌ ఉగ్రవాది , సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌జేఎఫ్‌) చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ కొద్ది రోజుల క్రితం భారత్‌ కి వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నెల 19 వ తేదీన ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని..ఒకవేళ ప్రయాణిస్తే మాత్రం అది వారి ప్రాణాలకు ప్రమాదమని తెలిపాడు.

ఈ బెదిరింపులతో బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ పంజాబ్‌ తో పాటు, ఢిల్లీ విమానాశ్రయాలలో ఎయిర్‌ ఇండియా విమానాలకు అదనపు భద్రతా తనిఖీలను చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పంజాబ్‌ లో కూడా అన్ని విమానాశ్రయాల్లో టెర్మినల్ బిల్డింగ్‌ సందర్శకులకు తాత్కాలికంగా ఎయిర్ పోర్ట్‌ ఎంట్రీ పాసులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

Also read: ఎయిర్‌ఇండియాకు మరోసారి షాక్‌.. భారీ ఫైన్ విధింపు.. ఎందుకంటే?

ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయంలో సందర్శకులు ప్రవేశ టికెట్లను నిషేధించారు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా ద్వారా ప్రయాణించవద్దని సిక్కు ప్రజల్ని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా దిగ్బంధనం ఉంటుంది. ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం’’ అని వీడియోలో పన్నూ పేర్కొన్నాడు.

ఈ వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేశాడు. అంతే కాకుండా నవంబర్‌ 19 న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ మూసేస్తారని, దాని పేరు కూడా మార్చుతారని, ఆ రోజు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని హైలెట్‌ చేస్తూ హెచ్చరించాడు. గతంలో కూడా పన్నూ ఇలాగే బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మోడీని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్‌ -పాలస్తీనా యుద్దం నుంచి నేర్చుకోవాలని అన్నాడు.

పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు అక్రమ ఆక్రమణలో ఉన్న వారంతా ప్రతిస్పందిస్తారు. హింస హింసని ప్రేరేపిస్తుంది అని గతంలో ఓ వీడియోల బెదిరించే ప్రయత్నం చేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు