Telangana : త్వరలో వైద్యారోగ్యశాఖలో పెండింగ్‌ పోస్టుల భర్తీ

వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం త్వరలోనే డీఎంఈతో పాటు డీపీఏ, డీసీహెచ్‌, కమిషనర్, టీవీపీసీ పోస్టులు భర్తీ చేయనున్నామని రాష్ట్ర సర్కార్ పేర్కొంది.

New Update
Telangana : త్వరలో వైద్యారోగ్యశాఖలో పెండింగ్‌ పోస్టుల భర్తీ

Health Department : తెలంగాణ(Telangana) లోని వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇటీవల ఇన్‌ఛార్జ్‌ డీఎంఈగా వాణిదేవి(Vani Devi) నియాంకంపై హైకోర్టు స్పందించింది. పూర్తిస్థాయి డీఎంఈని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే డీఎంఈతో పాటు డీపీఏ, డీసీహెచ్‌, కమిషనర్, టీవీపీసీ పోస్టులు భర్తీ(Fill Posts) చేయనున్నామని రాష్ట్ర సర్కార్ తెలిపింది.

Also Read : టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కీలక ప్రకటన!?

అయితే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి వైద్యారోగ్య శాఖలో పలు కీలక పోస్టులు భర్తీ చేయడం లేదు.. కేవలం ఇన్‌ఛార్జ్‌లను నియమించే ప్రభుత్వం ఆ సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. డీఎంఈ కేటగిరీలో.. డా.రమేష్‌ రెడ్డిని అప్పటి ప్రభుత్వం నియమించగా.. పలువురు హైకోర్టు(High Court) లో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై దర్యాప్తు జరిపిన న్యాయస్థానం పూర్తిస్థాయి డీఎంఈని నియమించాలని తేల్చి చెప్పింది. దీంతో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో 2023లోనే రాష్ట్ర సర్కార్‌ పూర్తి స్థాయి డీఎంఈ పోస్టును ఏర్పాటు చేసింది.

కానీ ఆ స్థానాన్ని ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. దీంతో ఈ పోస్టు భర్తీ కోసం రేవంత్‌ ప్రభుత్వం(Revanth Sarkar).. ఫిబ్రవరి 6న డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్ కమిటీ (DCP) ని ఏర్పాటు చేసింది. దీంతో ఈ కమిటీ సీనియర్‌ జాబితాను రూపొందించినప్పటికీ కూడా ఎన్నికల కోడ్‌ వల్ల నియామకాన్ని చేపట్టలేదు. ఎన్నికల ముగిశాక వైద్యరోగ్యశాఖలో ఈ నియమకాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర సర్కార్‌ స్పష్టం చేసింది.

Also Read : ఖబడ్దార్.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?

Advertisment
తాజా కథనాలు