/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/excessive-hunger-jpg.webp)
Excessive Hunger is a symptom of these diseases: ఆహారం అనేది ఒక వ్యక్తి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆహారం నుండి మనకు లభించే పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఆకలిగా అనిపించడం సాధారణ విషయం. కానీ కొంత మందికి ఆహారం తిన్న తర్వాత కూడా పదే పదే ఆకలి వేస్తుంది. తిన్నతర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తే దానిని హంగర్ పెగ్స్ అంటారు. తరచుగా ఆకలి వేయడం అంటే...శరీరానికి కావాల్సినంత పోషకాలు అందించడం లేదని అర్థం. మీకు కూడా ఆహారం తీసుకున్న తర్వాత పదే పదే ఆకలి వేస్తుంటే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే అధిక ఆకలి అనేక తీవ్రమైన వ్యాధుల సంకేతం కావచ్చు. అతి ఆకలికి ఏ వ్యాధులు సంకేతాలో తెలుసుకుందాం.
విపరీతమైన ఆకలికి(Excessive Hunger) కారణం ఏమిటి?
మధుమేహం(Diabetes):
అధిక ఆకలికి మధుమేహం కూడా కారణం కావచ్చు. డయాబెటిక్ రోగులకు ఆకలి అధికంగా ఉంటుంది. ఒకసారి తిన్నతర్వాత మళ్లీ తినాలనిపిస్తుంది. వాస్తవానికి, శరీరంలో ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇది జరుగుతుంది. మధుమేహం అనేది నయం చేయలేని వ్యాధి. అయితే సకాలంలో గుర్తిస్తే, ఆహారం, జీవనశైలిలో మార్పులతో దీనిని నియంత్రించవచ్చు.
థైరాయిడ్ వ్యాధి(Thyroid):
శరీరంలో థైరాయిడ్ అసమతుల్యమైనప్పటికీ, ఆకలి ఎక్కువగా ఉంటుంది. మెడలో సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి ఉంటుంది. దాని నుండి థైరాయిడ్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ సమతుల్యత శరీరంలో క్షీణించడం ప్రారంభించినప్పుడు, హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. థైరాయిడ్ సమస్యలో, ఆకలి మందగించడంతో పాటు, బరువు పెరగడం మొదలవుతుంది. కొంతమందికి ముఖంపై లేత జుట్టు కూడా కనిపిస్తుంది.
డిప్రెషన్(Depression):
ఒత్తిడి కారణంగా ప్రజలు తరచుగా డిప్రెషన్‌కు గురవుతారు. ఒత్తిడి లేదా డిప్రెషన్ కారణంగా చాలా మందికి ఎక్కువగా ఆకలి వేస్తుంది. దీని కారణంగా వారు అతిగా తింటారు. ఒత్తిడి కారణంగా, కార్టిసాల్ హార్మోన్ శరీరంలో పెరుగుతుంది. ఇది మన ఆకలిని ప్రభావితం చేస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/portrait-of-young-beautiful-hungry-woman-eating-bu-2023-06-21-07-23-18-utc-1024x683.webp)
మీకు తిన్న తర్వాత మళ్లీ ఆకలి వేస్తే ఇవి తీసుకోండి:
బాదంపప్పు:
తరచుగా ఆకలి సమస్య నుండి బయటపడాలంటే ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులను తీసుకోండి. బాదంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్ తగిన మొత్తంలో ఉంటాయి. ఇవి కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. దీని కారణంగా ఆకలి కంట్రోల్లో ఉంటుంది.
కొబ్బరి:
కొబ్బరిని తరుచుగా తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఊబకాయాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. కొబ్బరిలో ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల మీకు మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపించదు.
మజ్జిగ:
మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇందులో కావాల్సినన్నిప్రొటీన్స్ ఉంటాయి. మీకు ఆకలివేయగానే మజ్జిగను తీసుకోవడం అలవాటు చేసుకోండి.
మొలకలు:
మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్ తగిన మొత్తంలో ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది.
 Follow Us