మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గేతో సమావేశం అనంతరం వివేక్ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అందరి సమష్టి కృషితో వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారంటూ ఆరోపించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశామని.. రాష్ట్రం సాధించుకున్నాక కుటుంబ పాలన, అవినీతి పాలనతో కేసీఆర్ దోచుకున్నారంటు ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశానని వ్యాఖ్యానించారు. అలాగే కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని.. కమిషన్ల కోసమే దాన్ని రీడిజైన్ చేశారంటూ విమర్శించారు.
Also Read: హీటెక్కుతున్న రాజకీయాలు.. తెలంగాణకు రానున్న ప్రధాని
Also Read: తెలంగాణలో కొనసాగుతున్న ఐటీ దాడులు.. ఇది వారి పనే అంటున్న కాంగ్రెస్ నేతలు..
కేసీఆర్‌ను ఓడించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని.. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు రావాల్సిందిగా కోరారని వివేక్ అన్నారు. మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకున్నానని.. కాంగ్రెస్ నేతృత్వంలో కేసీఆర్ రాక్షస పాలనకు విముక్తి కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకే పార్టీ మారానంటూ చెప్పారు. అయితే ఎన్నికల్లో పోటీ అనే అంశం కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణలో జనసేన పోటీ చేసే 8 సీట్లు ఇవే?