Andhra Pradesh: పవన్ మాటలు పిట్టల దొరలా ఉన్నాయి.. మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాటలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయంటూ ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవచేశారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే పవన్‌ లక్ష్యమని.. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు.

Andhra Pradesh: పవన్ మాటలు పిట్టల దొరలా ఉన్నాయి.. మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు..
New Update

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ మాటలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నటన చూస్తుంటే చిరంజీవి సైతం ఆశ్చర్యపోయేలా ఉందంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రాజకీయ లబ్ధి చేకూర్చడమే పవన్ లక్ష్యమని.. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు.

Also read: కూటమిలో కొట్లాట?.. పొత్తులో లుకలుకలు..!

మరోవైపు విశాఖపట్నంలోని ఫిషింగ్ హర్బర్‌లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు బోటు కాలిపోయిన బాధిత మత్స్యకారులకు పరిహారం అందించామని వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మత్య్సకారుల సంక్షేమానికి చేసింది శూన్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క హార్బర్‌ గానీ. ఒక్క జెట్టి గాని నిర్మించిరా అంటూ ప్రశ్నలు సంధించారు.

Also Read: లోకేష్ యువగళం 2.0 షురూ!.. షెడ్యూల్ ఖరారు

#andhra-pradesh #telugu-news #pawan-kalyan #perni-nani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe