Mudragada: వైసీపీకి షాక్.. జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం..!

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను జనసేన నాయకులు కలిశారు. ఈ నెల 20 లేదా 23వ తేదీ లోపు పవన్ కల్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ని స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

Mudragada: నేనెందుకు సపోర్ట్ చేయాలి.. పవన్ అందుకు పనికిరాడన్న ముద్రగడ
New Update

Mudragada to Join Janasena: ఇటీవల తాను వైసీపీ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని.. టీడీపీ లేదా జనసేన పార్టీలోకి (Janasena Party) వెళ్తానని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని మరోసారి జనసేన నాయకులు కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సహా.. మరికొందరు నాయకులు ముద్రగడను కలుసుకున్నారు. అయితే ఆ నెల 20 లేదా 23వ తేదీ లోపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

Also Read: నాలుగేళ్ల తర్వాత సొంతూరుకు రఘురామకృష్ణంరాజు…అంతకు ముందు ఏం జరిగిందంటే..

జనసేనలోకి వస్తే సమాజానికి మేలు 

ముద్రగడ వైసీపీలోకి చేరుతున్నారని కొన్ని ఛానళ్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని బొలిశెట్టి అన్నారు. ఆయన పవన్‌కళ్యాణ్‌తో కలిసి జనసేనలోకి వచ్చేందుకు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇలాంటి మంచి వ్యక్తి జనసేన పార్టీలోకి వస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. కుటంబంలో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.. సర్దుకుపోయి ముందుకు వెళ్లాలని ముద్రగడతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో త్వరలోనే ముద్రగడ జనసేనలోకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

వైసీపీపై అలిగిన ముద్రగడ

ఇదిలాఉండగా.. ఇటీవల తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలు మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముద్రగడతో చర్చించేందుకు సిద్ధం కాగా.. ఆయన వారిని తిరస్కరించారు. వైసీపీ పార్టీ నుంచి ఎవరూ కూడా తన ఇంటి రావద్దని ఘాటుగా స్పందించారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ముద్రగడ పోటీ చేసిన ఫలితం ఉండదని వైసీపీ పెద్దలు అనడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన్ను బుజ్జగించేందుకు రాజ్యాసభకు కూడా పంపేందుకు వైసీపీ అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

పవన్ వ్యూహాలు

ఇప్పటికే మాజీ మంత్రి హరిరామజోగయ్యను (Harirama Jogaiah) కూడా పవన్ కల్యాణ్ కలిసినట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలో సీనియన్‌ నేతలను ఆయన కలుస్తూ వస్తున్నారు. అయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువసీట్లు గెలిచేలా జనసేనాని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Also Read: అంబటి రాంబాబు సంబరాల రాంబాబే ….దుమ్ములేపుతున్న పాట

#pawan-kalyan #telugu-news #ap-politics #janasena #mudragada
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe