/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/malla-reddy-jpg.webp)
MLA Malla Reddy : బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని కలవబోతున్నట్లు మల్లారెడ్డి ప్రకటన చేశారు. గతంలో ఇద్దరం టీడీపీ(TDP) లోనే ఉన్నామని పేర్కొన్నారు. డెవలప్‌మెంట్ కోసం సీఎంను కలిస్తే తప్పేముంది అని ప్రశ్నించారు. ఇదే విషయంపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. చర్చకు తావులేకుండా కలిసే ముందు సమాచారం ఇస్తానని అన్నారు. మేము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని అన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా తననే బీఆర్ఎస్ అధిష్టానం పోటీ చేయమందని అన్నారు. తన కొడుకు భద్రారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ ను అడుగుతున్నట్లు తెలిపారు.
నాకు వద్దు సార్..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) పై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయలేక పోయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ లో తమ పార్టీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఇది ఇలా ఉండగా మల్కాజ్గిరి ఎంపీగా తనను బీఆర్ఎస్ అధిష్టానం పోటీ చేయమంది అని తెలిపారు మల్లారెడ్డి. తనకు ఎంపీగా పోటీ చేసే ఇంట్రెస్ట్ లేదని అధిష్ఠాననానికి చెప్పినట్లు తెలిపారు. తనకు కాకుండా తన కుమారుడికి ఆ ఎంపీ టికెట్ ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ ను కోరినట్లు ఆయన తెలిపారు. మరి మల్లారెడ్డి మాట బీఆర్ఎస్ అధిష్టానం ఓకే అంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.
Also Read : 57 నిమిషాల మధ్యంతర బడ్జెట్…ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది
అరె సాలే అంటూ..
గతంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై భూతు పురాణం వినిపించిన సంగతి తెలిసిందే. అరె సాలె అంటూ తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మల్లారెడ్డి. ఇప్పుడు నేను, రేవంత్ ఒకే పార్టీ వాళ్ళమే అంటూ వ్యాఖ్యానించడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీసింది. మల్లారెడ్డి మాట్లాడుతూ.. 'త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాను.. మేము గతంలో టీడీపీలో కలిసి పని చేశాం.. ఇప్పుడు పార్టీలు మారం అంతే.. మా మధ్య రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు..' అని అన్నారు. మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే చర్చ జోరందుకుంది. మరి మాజీ మంత్రి మల్లారెడ్డి మనసులో ఏముందో ఆయనే చెప్పాలి.
Also Read : ‘విశ్వంభర’లో నయా లుక్.. చిరు జిమ్ బాడీ చూస్తే గూస్ బంప్సే!
RTV EXCLUSIVE UPDATES: