Kodali Nani strong Counter to Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పైనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాడీ వేడీగా చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నేతలు చిరంజీవిపై మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రేదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. చిరుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మంగళవారం మీడియాతో మాట్లాడని కొడాలి (Kodali Nani) .. సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీ గాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. వారు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. మనం డాన్స్ లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని చిరుకి కౌంటర్ ఇచ్చారు. మెగాస్టార్ గారు మాకు కాకుండా.. ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. వాళ్లకు కూడా 'ప్రభుత్వం గురించి మనకెందుకు' అని సలహాలు ఇవ్వొచ్చు కదా అని సూచించారు మాజీ మంత్రి కొడాలని నాని.
కాగా 'వాల్తేరు వీరయ్య' మూవీ 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పరోక్షంగా వైసీపీ ప్రభుత్వంపై, మంత్రి అంబటి రాంబాబుపై వ్యాఖ్యలు చేవారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదల కడుపు నింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని చిరంజీవి కామెంట్స్ చేశారు. అలాగే.. డిమాండ్ ఉన్న వారికి పారితోషికం ఎక్కువే ఇస్తారనిచెప్పారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇదిలావుండగా.. 'బ్రో' సినిమాలో(Bro Movie) తనని ఉద్దేశించి ఒక సన్నివేశం జోడించారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. అప్పుడు ఆయన పవన్ తన పారితోషికం వివరాల్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. పారితోషికం చెప్పలేని వాడు, రాజకీయాల్లో పారదర్శకంగా ఎలా ఉంటాడని నిలదీశారు మంత్రి అంబటి. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గానే చిరంజీవి పై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో కొడాలి నాని ఆ వెంటనే రంగంలోకి దిగి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడి వరకూ వెళ్తుందో.. దీనిపై వైసీపీ నేతలు ఇంకా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read: ‘తమ్ముడికి అండగా అన్న’.. మంత్రి అంబటికి ఇచ్చిపడేసిన చిరు.. మెగాస్టార్ ఏమన్నారంటే..?