KCR: అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ చలో నల్గొండ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ప్రజల ముందుకు రావడం.. మాట్లాడం ఇదే తొలిసారి. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు కృష్ణా జలాలవాటా పై జరుగుతున్న విషయం తెలిసిందే. KRMB కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు... లేదు బీఆర్ఎస్ హయాంలోనే KRMBని కేంద్రానికి అప్పగిస్తూ ఆనాటి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే.. ఈ వివాదానికి చెక్ పెట్టాలంటే అది కేసీఆర్ వల్లే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై కేసీఆర్ ఒక్కరే క్లారిటీ ఇవ్వగలరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి
బీఆర్ఎస్ నల్గొండకు.. కాంగ్రెస్ మేడిగడ్డకు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, శాసనసభ్యులు ఇవాళ(ఫిబ్రవరి 13) సందర్శించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బస్సుల్లో చేరుకున్నారు. రేవంత్ పర్యటనకు అన్ని పార్టీల శాసనసభ్యులను ఆహ్వానించారు, అయితే ప్రతిపక్ష BRSతో పాటు BJP సైతం సీఎంతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేయకూడదని నిర్ణయించుకున్నాయి.
ALSO READ: మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ బృందం.. కాసేపట్లో ప్రెస్ మీట్
DO WATCH: