వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వినుకొండకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హత్యకు గురైన రషీద్ ఇంటికి చేరుకున్న జగన్.. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. జగన్‌కు సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదని.. ఆయన ప్రైవేటు వాహనంలో వినుకొండకు చేరుకున్నారు.
Also read: భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!
ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రషీద్ హత్య ఘటనపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తాం. ఈ కేసులో ఉన్నవారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో వచ్చేలా చూస్తాం. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసే కార్యక్రమం కూడా చేద్దాం. 45 రోజుల్లోనే రాష్ట్రం అంతా అతలాకుతలం చేస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను తిరగనివ్వట్లేదు. మనకన్నా ఎక్కువ చేస్తామని చెప్పడంతోనే వాళ్లు గెలిచారు. కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హత్యా రాజకీయాలపై పోరాడుతాం. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తాం. కేంద్రం జోక్యం చేసుకుని వెంటనే ఈ హత్యారాజకీయాల్ని ఆపాలి. లేదంటే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. 45 రోజుల్లోనే 31 మందిని అరెస్టు చేశారు. లోకేష్ రెడ్‌బుక్ అంటూ పోలీసులు, అధికారుల్ని భయపెడుతున్నారు. ఈ కేసులో ఉన్నవారి పేర్లు ఛార్జిషీటులో వచ్చేలా చుద్దామని' జగన్ అన్నారు.